సెల్ఫీ టాక్‌ : బాలయ్య, వెంకీ తో అందాల ఖుష్బు

సౌత్‌ సీనియర్ స్టార్‌ నటి ఖుష్బు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.

Update: 2024-07-04 05:46 GMT

సౌత్‌ సీనియర్ స్టార్‌ నటి ఖుష్బు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఆమె షేర్ చేసే ఫోటోలు ఎప్పుడు వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. మరోసారి ఖుష్బు షేర్‌ చేసిన సెల్ఫీ లు వైరల్‌ అయ్యాయి.


తాజాగా చెన్నై లో జరిగిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నికోలై సచ్‌దేవ్‌ వివాహంకు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఆ తర్వాత జరిగిన వెడ్డింగ్‌ రిసెప్షన్ లో కూడా ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. టాలీవుడ్‌ కు చెందిన సినీయర్‌ స్టార్స్ తో పాటు యంగ్‌ స్టార్స్ హాజరు అయ్యారు.


ముఖ్యంగా వెడ్డింగ్‌ రిసెప్షన్ లో సీనియర్ స్టార్‌ హీరోలు బాలకృష్ణ మరియు వెంకటేష్ లు హాజరు అయ్యారు. అదే వేడుకలో పాల్గొన్న ఖుష్బు వారితో సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

టాలీవుడ్‌ లో ఖుష్బు హీరోయిన్‌ గా ఎంట్రీ వెంకటేష్ సినిమాతో అనే విషయం తెల్సిందే. బాలయ్య తో కూడా ఖుష్బూ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ అనుబంధంతోనే కనిపించిన వెంటనే ఈ ఇద్దరితో సెల్ఫీలు తీసుకుని, తన ఆనందాన్ని, ప్రేమని ఇలా వ్యక్తం చేసింది.

Tags:    

Similar News

eac