పిక్‌ టాక్‌ : లేడీ సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌

లేడీ సూపర్ స్టార్‌ నయనతార తన 39వ పుట్టిన రోజును జరుపుకుంది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆమె అభిమానులు సందడి చేశారు

Update: 2023-11-19 04:30 GMT

లేడీ సూపర్ స్టార్‌ నయనతార తన 39వ పుట్టిన రోజును జరుపుకుంది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆమె అభిమానులు సందడి చేశారు. నయన్‌ ఫోటోలు వీడియో లు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా బర్త్‌ డే హ్యాష్ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేయడం జరిగింది. అయితే ఒక ఫోటో చాలా ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది.


గతంలో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌ గా ఉండని నయన్‌ ఇప్పుడు తన పిల్లలతో పాటు, తన భర్త విఘ్నేష్ శివన్‌ తో కలిసి చాలా యాక్టివ్‌ గా సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. తాజాగా తన బర్త్‌ డే సందర్భంగా తీసుకున్న ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నయనతార దంపతులు పంచుకోవడంతో వైరల్‌ అయింది.

ఈ ఫోటోలో నయన్‌, విఘ్నేష్ శివన్‌ దంపతుల పిల్లలు అయిన ఉయుర్‌ రుద్రోనిల్‌ ఎన్‌ శివన్‌ మరియు ఉలగ్‌ ధైవాగ్‌ ఎన్‌ లతో సోషల్‌ మీడియా ద్వారా సందడి చేశారు. ఈ ఫోటో తో నయనతార ఫ్యాన్స్ కి కన్నుల విందు చేసే విధంగా చక్కటి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హిందీ లో జవాన్‌ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు జోరుగా సినిమాలు చేస్తోంది. ఒక వైపు హీరో లకు జోడీగా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ కథ లు చేస్తూ ఉంది. మినిమం గ్యారెంటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న నయన్‌ సోషల్‌ మీడియాలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఇలాంటి ఫోటోలతో సందడి చేస్తోంది.

Tags:    

Similar News