లాక్మే వీక్‌లో నటవారసురాళ్లు దుమ్ము దుమారం
బాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న ప్రతిభావనులుగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్‌ల పేర్లు మార్మోగుతున్నాయి. ఈ బ్యూటీ విలక్షణ ఎంపికలకు అభిమానులున్నారు.
మాల్దీవుల వెకేషన్ ల నుంచి గోవా పార్టీల వరకూ ప్రతిసారీ సారా అలీఖాన్- జాన్వీ కపూర్ వేడెక్కించే బికినీలతో మతులు చెడగొట్టిన వైనం మర్చిపోలేరు యూత్. జిమ్ యోగా సెషన్స్ లో టైట్ ఫిట్ దుస్తుల్లో టీజ్ చేయడం ఈ గుడ్ ఫ్రెండ్స్ కి అలవాటు. సోషల్ మీడియాల్లో నిరంతర ఫెస్టివల్ గురించి నెటిజనుల్లో చర్చ సాగుతూనే ఉంది. అయితే తన గ్లామరస్ ఇమేజ్ కి భిన్నంగా సారా అలీఖాన్ ఒక ట్రెడిషనల్ లెహంగాలో కనిపించింది. అయితే ఈ అందమైన డిజైనర్ డ్రెస్ లో సారా అందచందాలు మతులు చెడగొడుతున్నాయి.
ఎరుపురంగు లెహంగా చోళీలో సారా అందం చూడటానికి రెండు కళ్లు చాలవు. రెడ్ హాట్ లుక్ లో సారా కెమెరాలకు డ్యాషింగ్ గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. యంగ్ గాళ్ సారా బాలీవుడ్ స్టార్ కిడ్స్ లో ఎప్పటికీ స్టన్నర్ అని ప్రూవ్ అవుతోంది. అదే సమయంలో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్ కూడా అంతే కట్టి పడేసింది. జాన్వీ డార్క్ థీమ్డ్ డ్రెస్సింగ్ సెన్స్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఇక లాక్కమే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ- సారా దుమ్ము దులిపేసారు.
బాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న ప్రతిభావనులుగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్‌ల పేర్లు మార్మోగుతున్నాయి. ఈ బ్యూటీ విలక్షణ ఎంపికలకు అభిమానులున్నారు. నటిగా వైవిధ్యమైన పాత్రలతో సారా మెప్పించింది. సారా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ కోసం స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. సారా తన తండ్రి సైఫ్ అలీఖాన్ తో కలిసి ఓ ప్రకటనలో నటించింది. త్వరలోనే సినిమాలోను నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.