కళ్లకి జోడు.. చేతిలో గ్లాసు.. పాప కిరాకు..
సినిమాల్లో చిన్న చితక పాత్ర అయినా చేస్తూ వచ్చింది.
రెండు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నా స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడిన భామ రాయ లక్ష్మి. పేరు మార్చుకుంటే ఫేట్ మారుతుందేమో అనుకుని అలా కూడా ట్రై చేసినా అది జరగలేదు. దాదాపు 19 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న రాయ్ లక్ష్మి ఇమేజ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సినిమాల్లో చిన్న చితక పాత్ర అయినా చేస్తూ వచ్చింది. ప్రత్యేక గీతాలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటూ వచ్చిన రాయ్ లక్ష్మి సినిమాలు, వెబ్ సీరీస్ లతోనే కాదు ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
తను చేసే ప్రాజెక్ట్ ల గురించి కన్నా రాయ్ లక్ష్మి ఫోటో షూట్స్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. తన ఫాలోవర్స్ ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా రాయ్ లక్ష్మి ఫోటో షూట్స్ ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరో క్రేజీ ఫోటో షూట్ తో దర్శనమిచ్చింది అమ్మడు. థై*షో*తో టా*ప్ లేపేస్తున్న రాయ్ లక్ష్మి కళ్లకి బ్లాక్ గాగుల్స్, చేతిలో వైన్ గ్లాస్ తో రచ్చ చేస్తుంది.
రాయ్ లక్ష్మి కిరాక్ లుక్స్ ఫాలోవర్స్ కి మంచి కిక్ ఎక్కిస్తున్నాయి. సినిమాల పరంగా ఎలా ఉన్నా ఫోటో షూట్స్ తో మాత్రం రాయ్ లక్ష్మి రఫ్ఫాడించేస్తుంది. ఒకప్పుడు సినిమా అవకాశాలు ఆఫీస్ లకు వెళ్లి ఆడిషన్స్ ఇస్తే వచ్చేవి కానీ ఇప్పుడు తమ సినిమాకు కావాల్సిన హీరోయిన్స్ ప్రొఫైల్స్ అన్ని ఇన్ స్టాగ్రామ్ లో వెతుకుతున్నారు. అందుకే సీనియర్ భామలైనా జూనియర్ హీరోయిన్స్ అయినా సోషల్ మీడియా ద్వారానే ఆడియన్స్ కు గాలం వేస్తున్నారు.
ఇన్ స్టా ఫోటో షూట్స్ ద్వారానే పాపులర్ అవుతున్న భామలకు ఆ ఫోటో షూట్స్ తోనే సినిమా ఛాన్స్ లు కూడా వస్తున్నాయి. అయితే అలాంటి వారికి తను ఏమాత్రం తక్కువ కాదని రాయ్ లక్ష్మి కూడా వరుస ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ కి పిచ్చెక్కేలా చేస్తుంది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ తమిళ సినిమా ది లెజెండ్ కోసం స్పెషల్ సాంగ్ లో మెరిసిన రాయ్ లక్ష్మి హిందీలో భోలా సినిమా కోసం కూడా ప్రత్యేక గీతం చేసింది. ఛాన్స్ రావాలే కానీ ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అనేస్తున్న అమ్మడు స్పెషల్ సాంగ్ లకే పరిమితం కాకుండా స్పెషల్ రోల్స్ కూడా చేస్తే చూడాలని ఆమె ఫాలోవర్స్ ఆశిస్తున్నారు.