సుస్మితా సేన్‌కి అలా షాకిచ్చిన ప్ర‌ముఖ బిజినెస్‌మేన్

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మళ్ళీ ప్రేమలో పడ్డారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆయ‌న‌ తన ఇన్‌స్టాలో తన లేడీలవ్‌తో క‌లిసి ఉన్న‌ వీడియో మాంటేజ్‌ను షేర్ చేసాడు.

Update: 2025-02-14 15:30 GMT

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మళ్ళీ ప్రేమలో పడ్డారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆయ‌న‌ తన ఇన్‌స్టాలో తన లేడీలవ్‌తో క‌లిసి ఉన్న‌ వీడియో మాంటేజ్‌ను షేర్ చేసాడు. తద్వారా బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో బ్రేక‌ప్‌ని ధృవీకరించారు. లలిత్ మోడీ తన భాగస్వామి పేరును వెల్లడించలేదు కానీ, వేరొక మ‌హిళ‌తో జంట‌గా క‌లిసి ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. త‌మ మ‌ధ్య‌ 25 సంవత్సరాల స్నేహం ఒక మంచి సంబంధంగా మారిందని వెల్లడించాడు. లలిత్ మోడీ గతంలో మినల్ మోడీని వివాహం చేసుకున్నాడు. ఈ జంట 1991లో వివాహం చేసుకున్నారు. 2018లో క్యాన్సర్ కారణంగా మినల్ మరణించే వరకు కలిసి ఉన్నారు.

ప్రేమికుల దినోత్సవం నాడు తన లేడీలవ్‌తో వీడియో మాంటేజ్‌ను షేర్ చేసిన‌ లలిత్ మోడీ ఇలా రాసారు. ``ఒకసారి అదృష్టవంతుడు - అవును. కానీ నాకు రెండుసార్లు అదృష్టం. 25 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారినప్పుడు... రెండోసారి. మీ అందరికీ కూడా అలాగే అనిపిస్తుంద‌ని ఆశిస్తున్నాను #హ్యాపీ వేలెంటైన్స్ డే టు యు ఆల్``... అని రాసారు. ఈ వీడియో క్లిప్ ఈ జంట కలిసి గడిపిన విలువైన క్ష‌ణాల‌ను రివీల్ చేసింది. మోడీ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.

అదే స‌మ‌యంలో సుష్ తో విడిపోయారా? అంటూ కొంద‌రు ప్ర‌శ్నించారు. 2022లో సుష్మితా సేన్‌తో డేటింగ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన తర్వాత లలిత్ మోడీ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగింది. అత‌డు త‌మ షార్ట్ రిలేష‌న్ షిప్ లో మాల్దీవుల యాత్ర‌ నుండి సుష్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేసాడు. దానితో పాటు ``ఒక ఉత్కంఠభరితమైన ప్రపంచ పర్యటన తర్వాత లండన్‌కు తిరిగి వచ్చాను.. సుస్మిత‌తో చివరకు కొత్త జీవితాన్ని ప్రారంభించాను.. అని మోడీ వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌న దావాన‌లంలా మారింది.

సుస్మితాసేన్ తో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ల‌లిత్ మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను కూడా మార్చుకున్నారు. కొంత కాలానికే అదే సోష‌ల్ మీడియాల నుంచి సుష్మితతో ఉన్న ఫోటోల‌ను డిలీట్ చేసిన‌ప్పుడు వారి డేటింగ్ ముగిసింద‌ని అర్థ‌మైంది. ముందుగా 2023లో సుష్మితా సేన్ లలిత్ మోడీతో తన షార్ట్ డేట్ గురించి ప్రస్తావించింది. మీడియాతో మాట్లాడుతూ .. ఇది మరో దశ అయినా కానీ, ప్రజలు త‌న‌ను బంగారు బాతును ప‌ట్టింద‌ని అన‌డాన్ని ఆనందిస్తాన‌ని చెప్పింది. అంత‌కుముందు సుస్మితా సేన్ త‌న‌కంటే చిన్న‌వాడైన రోహ్మ‌న్ షాల్ అనే మోడ‌ల్ తో డేటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News