ఇతరుల మాటలు పట్టించుకోకూడదు.. కాపురంపై నటి!
షారూఖ్ `చక్ దే ఇండియా` చిత్రంలో నటించింది సాగరిక. ప్రీతి సభర్వాల్ తనే పొగరుమోతు అమ్మాయిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
నిత్య జీవితంలో ఇతరుల నుంచి అనవసరమైన పరిశీలనల్ని ఎదుర్కోవడం సహజం. ఒక మనిషి ఇంకో మనిషి వ్యవహారాల్లో తలదూర్చడం రెగ్యులర్ గా చూసేదే.. ఇది మనిషి నైజం.. అలాంటి సమయంలో సంయమనంతో ఉండటం చాలా అవసరమని తన భర్త జహీర్ ఖాన్ నేర్పించినట్టు సాగరిక ఘట్కే తెలిపారు.
షారూఖ్ `చక్ దే ఇండియా` చిత్రంలో నటించింది సాగరిక. ప్రీతి సభర్వాల్ తనే పొగరుమోతు అమ్మాయిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రీతి అనే క్రీడాకారిణి పాత్రలో తన నటన రీబాక్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. సాగరిక ఫ్యాషన్ మ్యాగజైన్‌లలో కూడా కనిపించింది. ఫ్యాషన్ షోలలో కనిపించింది. అయితే క్రికెటర్ భర్త జహీరో తో సాగరిక బాండింగ్ గురించి సోషల్ మీడియాల్లో చాలా కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని ఆ జంట ఎప్పుడూ పట్టించుకోలేదు.
ఇటీవలి ఇంటర్వ్యూలో.. సోషల్ మీడియా, ట్రోలింగ్ ల గురించి తన ఆలోచనలను సాగరిక షేర్ చేసారు. ఓ చాటింగ్ సెషన్‌లో సాగరిక తన వివాహం తర్వాత, ముఖ్యంగా తన భర్త పదవీ విరమణ చేసిన తర్వాత లైఫ్ మారిందని తెలిపారు. ఇటీవల భర్తతో ఎక్కువ సమయం గడిపానని, ఆట కారణంగా ఇప్పుడు ఒత్తిళ్లు లేవని సాగరిక తెలిపింది. అలాగే బిజీ లైఫ్ తమ వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేయదని, ఇతరులు అనవసరంగా మాట్లాడేవి పెద్దగా పట్టించుకోమని కూడా సాగరిక వెల్లడించారు. ఇతరుల అభిప్రాయాల ప్రభావానికి గురికాకుండా ఉండగల జహీర్ ఖాన్ సామర్థ్యాన్ని తాను ఆరాధిస్తానని సాగరిక తెలిపింది. అతడి పద్ధతుల నుంచి కొన్నిటిని తాను నేర్చుకున్నానని తెలిపారు. కేవలం మేం వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెడతాము. బయటి వారు ఏం మాట్లాడుకున్నారో దాని గురించి చర్చించకుండా.. మరింత అర్థవంతమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తాము అని అన్నారు.
బయటి వాళ్లు ఎన్నో అనుకుంటారు. కానీ ఇంట్లో భార్యాభర్తలుగా మా సంభాషణలు, ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయని ఘాట్గే వివరించారు. మేం రెగ్యులర్ గా ఇంటి పనుల వంటి రోజువారీ విషయాల గురించి మాట్లాడుతాం. బయటి ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మా లైఫ్ గురించి మేం ఆలోచిస్తాం. మనకు ఏది సరైనది అనిపిస్తే అది చేయడం చాలా అవసరమని సాగరిక అన్నారు.