ఇల్లీ బేబ్ ఇన్ స్టా సర్ ప్రైజ్..!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఇలియాన అక్కడ కూడా అవకాశాలు లేక ఖాళీ అయిపోయింది.
గోవా బ్యూటీ ఇలియానా తన ప్రెగ్నెన్సీ స్టోరీస్ తో తన ఫాలోవర్స్ ని ఖుషి చేస్తుంది. లాస్ట్ ఇయర్ నవంబర్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందన్న విషయాన్ని ఒక వీడియో రూపంలో చెప్పిన ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టోరీస్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. తన స్టోరీస్, స్టేటస్ లతో అలరిస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా ఫ్లవర్ బొకే, ఇంకా స్నాక్స్ తింటూ కొటేషన్స్ చెబుతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఇలియాన అక్కడ కూడా అవకాశాలు లేక ఖాళీ అయిపోయింది.
ఇక ఈ క్రమంలో కొన్నాళ్లు డేటింగ్ చేసిన మైఖెల్ డోలన్ ని పెళ్లాడింది అమ్మడు. ఇప్పటికే ఇలియానా ఒక బాబుకి జన్మనిచ్చింది. అతని పేరుని కొవా ఫోనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇక అమ్మడు ఇప్పుడు రెండో రెండోసారి తల్లి కాబోతుంది. అంతేకాదు తన ప్రెగ్నన్సీ స్టోరీస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
తెలుగులో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మహేష్ బాబుతో నటించిన పోకిరితో టాప్ రేంజ్ కి వెళ్లింది. పోకిరి తర్వాత వరుస స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేసింది అమ్మడు. ఐతే సౌత్ లో కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే బాలీవుడ్ బాట పట్టింది అమ్మడు. ఆ టైం లో తెలుగు, తమిళ్ ఛాన్స్ లు వచ్చినా కాదనేసింది. అందుకే అప్పటి నుంచి ఇలియానాకి సౌత్ నుంచి ఆఫర్లు రాలేదు. ఐతే బాలీవుడ్లో పెద్దగా వర్క్ అవుట్ కాలేదని గుర్తించి మళ్లీ సౌత్ వైపు చూసినా ఇక్కడ ఎవరు ఆమెను పట్టించుకోలేదు.
రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసిన ఇలియానా ఆ తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు. పెళ్లై పిల్లలు ఉన్నా చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. కానీ ఇలియానా మాత్రం సినిమాలను వదిలేసి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. రెండో బేబీ కూడా వచ్చిన తర్వాత అమ్మడు ఏమైనా మళ్లీ తెర మీద కనిపించాలని ప్రయత్నిస్తుందేమో చూడాలి. ఇప్పుడు కాకపోయినా కొంత గ్యాప్ తీసుకున్నా సరే ఇలియానా మళ్లీ తెర మీద కనిపిస్తే చాలు ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. ఐతే హీరోయిన్ గా కాకపోయినా అమ్మడి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తానంటే దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తారేమో చూడాలి.