మారుతి నెక్స్ట్ టార్గెట్ మెగాస్టార్!
యంగ్ డైరెక్టర్ మారుతి మెగాస్టార్ చిరంజీవిపై గురి పెట్టాడా? ప్రభాస్ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి
యంగ్ డైరెక్టర్ మారుతి మెగాస్టార్ చిరంజీవిపై గురి పెట్టాడా? ప్రభాస్ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి. మారుతితో ఓ సినిమా చేస్తానని చిరంజీవి గతంలో పబ్లిక్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకూ అది జరగలేదు. ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకటి రెండు భారీ హిట్లు అందుకున్న దర్శకుల ట్రాక్ రికార్డు చెక్ చేసుకుని అవకాశం ఇచ్చేస్తారు.
మెగా కాంపౌండ్ లో వశిష్ట మల్లిడి అలా చేరినవాడే. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తదుపరి అనీల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతోనూ సినిమాలు చేస్తున్నారు. వీళ్ల కంటే ముందుగానే మారుతితో సినిమా చేస్తానని ప్రకటించారు. కానీ అది ఇంతవరకూ సాధ్యపడలేదు. ఎందుకంటే? మారుతి ఇంతవరకూ మెగాస్టార్ మెప్పించే స్టోరీ వినిపంచలేదు కాబట్టి. కొంత కాలంగా రాజాసాబ్ పనుల్లోనే మారుతి బిజీగా ఉన్నాడు.
అదీ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో అందులో మునిగిపోయాడు. ఎలా లేదన్నా ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. అటుపై మారుతి మెగాస్టార్ ని మెప్పించే స్టోరీపై పడతాడని సమాచారం. ఎలాగైనా మెగాస్టార్ ని తన స్టోరీ తో మెప్పించి గొప్ప సినిమా తీయాలని కసితో ఉన్నాడుట. తనకన్నా వెనకొచ్చిన వారంతా చిరంజీవితో సినిమా చేస్తుంటే తాను మాత్రం ఇంకా చేయకపోవడం ఏంటనే కసి మారుతిలో బలంగా మొదలైందని ఆయన సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం.
శ్రీకాంత్, అనీల్ సినిమాల తర్వాత తన పేరే చిరంజీవి లిస్ట్ లో కనిపించాలని భావిస్తున్నాడుట. ఇప్పటికే ఖాళీ సమయంలో స్టోరీకి సంబంధించిన పనుల్లోనే నిమగ్నమవుతున్నాడుట. మొత్తానికి మారుతి వచ్చ ఏడాది ఎలా లేదన్నా? చిరంజీవితో సినిమా చేసేలాగే కనిపిస్తున్నాడు.