వీరమల్లులో మాస్ ఎలిమెంట్స్ కు లోటే ఉండదు: నిధి
ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరోయిన్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్వహించిన ట్విట్టర్ స్పేస్ లో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, ఏఎం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఇదిలా ఉంటే తాజాగా వీరమల్లు సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట రొమాంటిక్ గా ఉంటుందని, ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి నిధి స్టెప్పులేయనుందని రిలీజ్ చేసిన పోస్టర్ ను బట్టి అర్థమవుతుంది. వీరమల్లు సెకండ్ సాంగ్ ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరోయిన్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్వహించిన ట్విట్టర్ స్పేస్ లో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
హరిహర వీరమల్లు టీజర్ లో మీరు చూసింది శాంపిల్ మాత్రమేనని, సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లను ఆడియన్స్ కోసం దాచిపెట్టినట్టు నిధి వెల్లడించింది. ఇప్పటివరకు సినిమా నుంచి దేన్నీ పెద్దగా రివీల్ చేయలేదని, వీరమల్లులో ఎన్నో ట్విస్టులుంటాయని అమ్మడు తెలిపింది. కథ ఎక్కడా సాగదీసినట్టు అనిపించదని స్క్రీన్ ప్లే చాలా బావుంటుందని నిధి చెప్పింది.
వీరమల్లు సినిమాలో ఓరంగజేబు ట్రాక్ కొంచెమే ఉంటుందని, సినిమా మొత్తం దాని గురించే కాదని చెప్పిన నిధి, మూవీలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ మొదటి రోజు షూట్ చేసిందని తెలిపింది. వీరమల్లులో పంచమిగా తన పాత్ర ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రల్లో ది బెస్ట్ అని చెప్తున్న నిధి, పవన్ కళ్యాణ్ నటనను చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది.
కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆయన సీన్ కోసం రెడీ అయిపోవడం చూసి తాను షాకయ్యానని నిధి అంది. కొల్లగొట్టినాదిరో సాంగ్ ను చాలా భారీ సెట్ లో తెరకెక్కించారని, ఇదొక డ్యాన్స్ నెంబర్ అని, వీరమల్లులో ఈ పాటతో పాటూ మరికొన్ని డ్యాన్స్ నెంబర్లున్నాయని, ఫ్యాన్స్ కు మాస్ ఎలిమెంట్స్ కొదువే ఉండదని, ఇంతకంటే సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడకూడదని, సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావాల్సి వస్తుందని నిధి వెల్లడించింది.