నష్టాల్లో మలయాళ పరిశ్రమ..?
వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో పదుల సంఖ్యలో సినిమాలు సక్సెస్ అవ్వడం పరిశ్రమకు భారీ నష్టాలు వచ్చేలా చేస్తుంది.
కంటెంట్ ఉన్న సినిమాలు అందిస్తూ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతున్న పరిశ్రమ మలయాళ పరిశ్రమ. అక్కడ సినిమాలు ఎక్కువగా కథాబలంతోనే తెరకెక్కుతాయి. కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఐతే అలాంటి మలయాళ పరిశ్రమ కూడా నష్టాల్లో నడుస్తుంది. వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో పదుల సంఖ్యలో సినిమాలు సక్సెస్ అవ్వడం పరిశ్రమకు భారీ నష్టాలు వచ్చేలా చేస్తుంది.
అంతేకాదు సినిమా నిర్మాణ వ్యయం కూడా బాగా పెరుగుతుందని తెలుస్తుంది. 50 కోట్లతో తీయాల్సిన వంద కోట్ల పైన బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడే ప్రమాదమని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మిగతా భాషలతో పోలిస్తే మలయాళంలోనే తక్కువ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తారు. ఐతే అక్కడ సినీ పరిశ్రమ 30 శాతం పన్ను కడుతుంది. మిగతా ఎక్కడ ఇంత పన్ను శాతం లేదు. అదీగాక స్టార్స్ రెమ్యునరేషన్ కూడా చుక్కల్లో ఉంటున్నాయి.
సినిమా బడ్జెట్ లో సగానికి పైగా రెమ్యునరేషన్ కోసమే ఖర్చు అవుతుంది. అందుకే నిర్మాతల మండలితో పాటు సినిమా పరిశ్రమకు సంబందించిన అన్ని వర్గాల నుంచి మార్పు రావాలని కోరుతున్నారు. ఇలానే కొనసాగితే పరిశ్రమ మరింత నష్టం వాటిల్లుతుందని రెమ్యునరేషన్ విషయాల్లో మార్పులు చేయకపోతే జూన్ 1 నుంచి షూటింగులు కూడా నిలిపివేయాలని అనుకుంటున్నారట.
అంతేకాదు పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల మీద సరైన నిర్ణయాలు తీసుకోవాలని.. వీటికి ప్రభుత్వ సహకారం కోరాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు వినతి పత్రాన్ని సమర్పించాలని పరిశ్రమ పెద్దలు నిర్ణయించారు.
మలయాళ పరిశ్రమ అంటే కథాబాలం ఉన్న సినిమాలని అందరు భావిస్తారు. ఐతే అక్కడ కూడా నిర్మాణ వ్యయం అధికమవుతుందని నిర్మాతలు వాపోతున్నారు. ముఖ్యంగా సినిమా ప్రొడక్షన్ కన్నా స్టార్ రెమ్యూనరేషన్ ఇంకా మిగతా రెమ్యునరేషన్ ల వల్లే నిర్మాణ వ్యయం పెరుగుతుంది.
ఐతే ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నా మలయాళం పరిశ్రమ మీద మరింత ఎఫెక్ట్ పడేలా చేస్తుందని వారు అంటున్నారు. అంతేకాదు అక్కడ పన్ను విధానంలో మార్పు కోసం ప్రభుత్వ సహకారం కూడా కోరుతున్నారు. మలయాళ సినిమాలు థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నా అక్కడ నుంచి వచ్చే ప్రతి సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఐతే అక్కడ వందల సంఖ్యల్లో రిలీజ్ అవుతున్న సినిమాలకు పదుల సంఖ్యల్లో సక్సెస్ పర్సంటేజ్ ఉంది. అందుకే పరిశ్రమ బాగు పడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సినీ పెద్దలు, నిర్మాతల మండలి చెబుతున్నారు.