ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అవుతున్న బాలయ్య పాట
ఇప్పుడు బాలయ్య నటించిన డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ కూడా అదే విధంగా పాపులరవుతోంది.
సౌత్ సినిమా స్థాయి ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూసే వారంతా ఇప్పుడు అదే తెలుగు సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంత గొప్ప స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి స్టెప్ నుంచి తగ్గేదేలే డైలాగ్ వరకు అన్నీ నేషనల్ లెవెల్ లో ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే.
ఇప్పుడు బాలయ్య నటించిన డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ కూడా అదే విధంగా పాపులరవుతోంది. సినిమా రిలీజ్ టైమ్ లో ఈ సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఇదేం పాట, ఇవేం స్టెప్స్ అని విమర్శించారు. విమర్శించిన వారంతా విస్తుబోయేలా ఈ సాంగ్ దేశం దాటి మరీ పాపులారిటీని దక్కించుకుంటుంది.
బాలయ్య, ఊర్వశీ కలిసి చేసిన ఈ పాటలోని డ్యాన్స్ మూమెంట్స్ ను రీ క్రియేట్ చేస్తూ వేల మంది రీల్స్ చేస్తున్నారు. ఈ పాటకు రీల్స్ చేస్తే ఎవరికైనా మంచి వ్యూస్ రావడం గ్యారెంటీ. ఈ కారణంతోనే దబిడి దిబిడి సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఏ ఫంక్షన్ జరిగినా ఈ పాటకు డ్యాన్సులేస్తున్నారు జనాలు.
ఇటీవలే కాలేజ్ అమ్మాయిలు హాస్టల్ లో వేసిన దబిడి దిబిడి స్టెప్పులు వైరల్ అవగా, ఇప్పుడు విదేశీ అమ్మాయిలు ఈ సాంగ్ కు వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప పాట తర్వాత ఓ సాంగ్ ఈ రేంజ్ లో వైరల్ అవుతుందంటే అది ఈ పాటే. చూస్తుంటే ముందు ముందు ఈ పాటకు మరింత రీచ్ పెరగడం ఖాయం.
దబిడి దబిడి సాంగ్ కోసం తమన్, మ్యూజికల్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అదే ఇచ్చాడు. ఆ పాటకు శేఖర్ చేసిన కొరియోగ్రఫీని కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మొదట్లో ఈ సాంగ్ స్టెప్స్ పై నెట్టింట తీవ్ర విమర్శలొచ్చాయి. ఇప్పుడు వారంతా ఈ సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవడాన్ని చూసి షాకవుతున్నారు.