పృథ్వీరాజ్‌కి షాకిచ్చే మెసేజ్ పంపిన అమీర్‌ఖాన్

మార్చి 27న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న ఈ స‌మ‌యంలో మోహ‌న్ లాల్- పృథ్వీరాజ్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.;

Update: 2025-03-22 16:43 GMT

పృథ్వీరాజ్ సుకుమారన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'L2: ఎంపురాన్‌' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమాను పృథ్వీరాజ్ చురుగ్గా ప్రమోట్ చేస్తున్నారు. మార్చి 27న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న ఈ స‌మ‌యంలో మోహ‌న్ లాల్- పృథ్వీరాజ్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.

తాజాగా ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించారు. ఎల్ 2 ఎంపురాన్ లో న‌టించిన అమీర్ ఖాన్ సోద‌రి నిఖ‌త్ ఖాన్ గురించి త‌న‌కు ముందుగా ఏమీ తెలియ‌ద‌ని పృథ్వీరాజ్ అన్నారు. ఆమె ఎవ‌రో చెప్ప‌కుండా ఆడిష‌న్ లో పాల్గొని సెల‌క్ట‌య్యార‌ని తెలిపారు. నిఖ‌త్ అమీర్ స‌ర్ కి సోద‌రి అని కాస్టింగ్ డైరెక్ట‌ర్ చెప్పాకే తెలిసింద‌ని, తాను చాలా ఆశ్చ‌ర్య‌పోయాన‌ని అన్నారు.

`ఎల్‌2`లో సుభద్ర బెన్ పాత్రకు నిఖత్‌ ఎంపికైన‌ విధానంపై స్పందిస్తూ ``నేను ఆమె ఆడిషన్‌ను ఇష్టపడ్డాను.. సినిమాలో ఆమె న‌టించాల‌ని అనుకున్నాను. నా కాస్టింగ్ డైరెక్టర్ అంగీకరించి, ఆమె అమీర్ సర్ సోదరి! అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే అమీర్ సర్‌కు ఫోన్ చేసాను. ఇప్పుడే ఆయ‌న‌ నాకు మెసేజ్ పంపాడు. `నా సోదరి సినిమాలో బాగుందా?` అని అడిగాను. ``సర్ ఆమె ది బెస్ట్ అనేకంటే ఇంకా చాలా బాగుంది! అని నేను అన్నాను అని పృథ్వీరాజ్ వివరించాడు.

నిఖ‌త్ ఖాన్ చాలా బాలీవుడ్ సినిమాల్లో న‌టించారు. ప‌ఠాన్, మిష‌న్ మంగ‌ళ్ లాంటి భారీ చిత్రాల్లో ఆమె న‌టించారు. #L2Eలో నిఖత్ ఖాన్ సుభద్ర బెన్‌గా న‌టిస్తున్నారు. మోహ‌న్ లాల్- పృథ్వీరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లలో న‌టించ‌గా, పృథ్వీరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లూసీఫ‌ర్ కి ఇది సీక్వెల్. మోహన్ లాల్ ప‌వ‌ర్ ఫుల్ స్టీఫెన్ నేడుంపల్లి పాత్రను పోషించి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల‌ హృదయాలను గెలుచుకుంది. సీక్వెల్ లో ఆయ‌న తిరిగి అదే పాత్ర‌తో వార్ లోకి వ‌స్తున్నారు. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ఇది ఈ సీజ‌న్ లో వ‌చ్చిన మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ట్రైల‌ర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News