అఖిల్ లైనప్ పౌజీలా ప్లాన్ చేస్తున్నాడా!
ఈ ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. కానీ రిలీజ్ మాత్రం పక్కాగా ఉంటుంది.;
'ఏజెంట్' ప్లాప్ తో అక్కినేని అఖిల్ ఏ రేంజ్ లో అలెర్ట్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. 'ఏజెంట్' రిలీజ్ అయి రెండేళ్లు సమీపిస్తున్నా? ఇంతవరకూ మరో సినిమా రిలీజ్ చేయలేదు. ఆ మధ్య 'లెనిన్' చిత్రాన్ని ఫైనల్ చేసి పట్టాలెక్కించాడు. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. ఈ ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. కానీ రిలీజ్ మాత్రం పక్కాగా ఉంటుంది.
అయితే ఈ సినిమాతో సంబంధం లేకుండా అఖిల్ తదుపరి చిత్రాల గురించి కూడా సీరియస్ గానే ఆలోచన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంత మంది డైరెక్టర్లను వెయిటింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో అఖిల్ కి కమిట్ మెంట్ ఉంది. అనీల్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కాలి. కానీ అనివార్య కారణాలతో డిలే అవుతుంది.
అలాగే 'సామజవరగమన'తో మంచి గుర్తింపు దక్కించుకున్న త్రయంలో ఒకరైన నందుతోనూ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నాడుట. ఇటీవలే లైన్ వినిపించడంతో అది నచ్చడంతో డెవలెప్ చేయమని చెప్పాడుట. ఇందులో హీరోయిన్ పాత్రకు కృతిశెట్టి పక్కాగా యాప్ట్ అవ్వడంతో ఆమె ఫైనల్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే పూరి జగన్నాధ్ కూడా అఖిల్ కి స్టోరీ వినిపించినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
దీంతో అఖిల్ ప్లానింగ్ ఎలా ఉందన్నది క్లియర్ గా అర్దమవుతుంది. తొలి సినిమా నుంచి అఖిల్ ఇలా కొత్త దర్శకుల్ని లైన్ లో పెట్టింది లేదు. అనుభవ పూర్వకంగా ప్లానింగ్ ఎలా ఉండాలి? అన్నది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. ఈ విషయంలో డార్లింగ్ ప్రభాస్ ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభాస్ లాగే రెండు షిప్టులు పనిచేయగల్గితే? అఖిల్ మరింతగా షైన్ అవుతాడు. మరి ఆ ఛాన్స్ తీసుకుంటాడో ? లేదో.