సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరు చూస్తారు..!

సంపత్ నంది టీం వర్క్స్ బ్యానర్ లో అశోక్ తేజ డైరెక్షన్ లో వచ్చిన ఓదెల సినిమా ప్రేక్షకులను మెప్పించగా ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా ఓదెల 2 అంటూ మరో అద్భుతమైన కథతో వస్తున్నారు.;

Update: 2025-03-22 14:32 GMT

దర్శకుడిగా తన మార్క్ చూపిస్తూ నిర్మాతగా కొత్త కథలను తెర మీదకు తెస్తున్నారు సంపత్ నంది. సంపత్ నంది టీం వర్క్స్ బ్యానర్ లో అశోక్ తేజ డైరెక్షన్ లో వచ్చిన ఓదెల సినిమా ప్రేక్షకులను మెప్పించగా ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా ఓదెల 2 అంటూ మరో అద్భుతమైన కథతో వస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఓదెల 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సినిమా గురించి సంపత్ నంది స్పీచ్ ఆకట్టుకుంది. ఓదెల 2 సినిమా టీజర్ ని మహా కుంభమేళాలో లో రిలీజ్ చేశాం. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనికి ప్రేక్షకులకు, మీడియాకు, లార్డ్ శివ కారణమని అన్నారు.

ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్.. ఆ ఊళ్లో పుట్టి పెరిగిన నేను దాని మీద గౌతం ప్రేమతో ఈ సినిమా కథ రాసి తీశాను. ఊరిని కాపడేది ఆ ఊళ్లో ఉన్న దేవుడి గుడి.. ఓదెల విలేజ్ లో ఏ కష్టం వచ్చిన ఓదెల మల్లన్న నాగ సాధు ఎలా పరిష్కరిస్తారన్నదే సినిమా కథ అని అన్నారు సంపత్ నంది.

ఈ సినిమాలో కంటెంట్, స్క్రీన్ ప్లే విజువల్ వండర్ గా ఉంటాయి. భైరవి పాత్రలో తమన్నా చాలా అద్భుతంగా నటించారు. తమన్నా పాత్ర కోసమే ఈ పాత్ర పుట్టింది. అందుకే ఆమెను వెతుక్కుంటూ వెళ్లిందని అన్నారు సంపత్ నంది. 20 ఏళ్లుగా తమన్నా గొప్ప డెడికేషన్ తో పనిచేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ చూశానో ఇప్పుడు కూడా అంతే డెడికేషన్ తనలో ఉంది. అందుకే 20 ఏళ్లుగా టాప్ చెయిర్ లో కూర్చుని ఉన్నారు. తమన్నా లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని అన్నారు సంపత్ నంది. ఆమె మరో 20 ఏళ్లు ఇలానే మనందరినీ ఎంటర్టైన్ చేయాలని అన్నారు.

ఓదెల 2 కు సౌందర్ రాజన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అజనీష్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఉండే సినిమా.. సినిమాను ప్రేమించే పేక్షకులు ఎక్కడ ఉన్నా ఈ సినిమా చూస్తారని అన్నారు సంపత్ నంది.

Tags:    

Similar News