మలయాళ సినిమాకు ఇలాంటి ఓపెనింగ్సా.. ఇదేమి ఊచకోత సామీ!
మోహన్‌లాల్ నటనకి ఉన్న క్రేజ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన స్క్రీన్‌ప్లేకి ప్రేక్షకుల్లోనూ ట్రేడ్‌లోనూ మంచి హైప్ ఉంది.;
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పుడు ఒక మలయాళ సినిమా అంచనాలకు మించి చర్చల్లో నిలుస్తోంది. స్టార్ హీరోలతో కాదు, మాస్ మసాలా లేకపోయినా, కంటెంట్ కంటెంట్ గానే ఉంటే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తాజాగా ‘ఎల్2: ఎంపురాన్’ నిరూపిస్తోంది. లూసిఫర్ సినిమాకు సీక్వెల్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ సెట్ చేసుకుంది. కానీ ఈ బజ్‌ని క్యాష్ చేయడం చాలా సినిమాలకు కష్టమే. కానీ ఎల్2 మాత్రం దాన్ని వాడేసుకుంది.
మోహన్‌లాల్ నటనకి ఉన్న క్రేజ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన స్క్రీన్‌ప్లేకి ప్రేక్షకుల్లోనూ ట్రేడ్‌లోనూ మంచి హైప్ ఉంది. ఇక ఆ ఆసక్తి వలన, విడుదలకు ముందే భారీ స్థాయిలో కనిపిస్తోంది. అంతేకాదు, ఇప్పుడిదే సినిమాకు చరిత్ర సృష్టించే స్థాయిలో ఓపెనింగ్స్‌ను తీసుకురావడంలో కీలకంగా మారింది. భారీ బడ్జెట్‌తో, దేశవ్యాప్తంగా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తుండటంతో, ‘ఎల్2: ఎంపురాన్’కు అన్ని కేంద్రాల్లోనూ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి.
లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్ వసూళ్లు రూ.20 కోట్ల మార్క్‌ను దాటేశాయట. మలయాళ సినిమా హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరూ అందుకోలేని స్థాయిలో మోహన్‌లాల్ ఈ చిత్రం ద్వారా మార్కెట్‌ను విస్తరించాడు. బుక్ మై షోలో 24 గంటల్లో 6.28 లక్షల టికెట్లు అమ్ముడవడం కూడా ఓ రికార్డే. ఇప్పటివరకు అల్లు అర్జున్ 'పుష్ప 2', ప్రభాస్ 'కల్కి 2898AD' వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే వచ్చిన రేంజ్ ఇది.
ఈ హైప్ వల్ల ఫస్ట్ డే వసూళ్లు కచ్చితంగా కొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. మలయాళం మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ బుకింగ్స్ స్టెడీగా పెరుగుతున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమాకు స్పెషల్ స్క్రీన్లు కేటాయించబడుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంతో పాటు ఆయన నటన కూడా ఈ సినిమాకి మిలియన్ల ప్రేక్షకులను మళ్లించబోతున్నట్లు తెలుస్తోంది.
మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేలోపు ఈజీగా 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయగలదా అన్నదే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒక మలయాళ సినిమాకి దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ప్రేక్షకుల స్పందన రావడం అరుదైన పరిణామం. ఇది కేవలం మోహన్‌లాల్ స్టామినాకు కాదు, కంటెంట్‌కు ప్రేక్షకుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇక రిలీజ్ తర్వాత వసూళ్ల వర్షం ఎప్పటి వరకు సాగుతుందో చూడాలి.