రెబా పాప మ్యాడ్ లుక్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్!
తెలుగు ప్రేక్షకులకైతే ‘సామజవరగమన’ మూవీ ద్వారా పరిచయం కాగా, అక్కడ తన సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంది.;
2016లో మలయాళ సినిమా ‘జాకోబింటే స్వర్గరాజ్యం’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్… తన నటన, గ్లామర్‌తో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘జరుగండి’ వంటి తమిళ చిత్రాల్లో నటించి కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు ‘బిగిల్’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకైతే ‘సామజవరగమన’ మూవీ ద్వారా పరిచయం కాగా, అక్కడ తన సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంది.
మూడు భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మల్టీ ఇండస్ట్రీ యాక్ట్రెస్‌గా నిలిచిపోయింది. ఇక త్వరలొ రాబోయే మ్యాడ్ స్క్వేర్ లో కూడా అమ్మడు స్పెషల్ పాత్రలో ఆకట్టుకోనుంది. అయితే తన కెరీర్‌ను సినిమాలతో మాత్రమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా రెబా నిరంతరం కాప్చర్ చేస్తోంది. ప్రయాణాలు, ఫోటోషూట్స్, ఫీల్ గుడ్ మూమెంట్స్ అన్నీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
ట్రిప్‌లో ఉన్నా, షూటింగ్‌లో ఉన్నా ఓ నవ్వు, ఓ స్టైల్ మోడ్‌లో రెబా కనిపించటం కామన్‌గా మారిపోయింది. అదే విధంగా ఈసారి కూడా తన గత రాత్రి అనుభూతులను ఓ క్యూట్ క్యాప్షన్‌తో షేర్ చేసింది – “గత రాత్రి గురించి” అంటూ హార్ట్ ఐకాన్, ఈవిల్ ఐ ఎమోజీ జత చేస్తూ ఓ స్టన్నింగ్ నైట్ లుక్ ఫోటో సిరీస్‌ను పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో రెబా మోనికా ఓ బ్రౌన్ లేస్ ఫుల్ల్ హ్యాండ్ డ్రెస్‌లో అదరగొట్టింది.
క్యూట్ హీల్ సాండల్స్‌తో వాలుగా చూసేలా ఇచ్చిన స్టైల్ పోజులు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రత్యేకంగా ఓ ఫోటోలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నిలబడి ఇచ్చిన పోజ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రెస్టారెంట్ లైట్‌లో పడిన లైటింగ్, రెబా లుక్, ఆమె ఎక్స్‌ప్రెషన్ ఇవన్నీ కలసి ఈ ఫోటోలను ఇంకొక లెవెల్‌కు తీసుకెళ్లాయి. కామెంట్స్‌లో నెటిజన్లు ‘ఫైర్’, ‘గార్జియస్’, ‘ఫెషన్ ఐకాన్’ అంటూ ప్రశంసలతో ఓ రేంజ్‌లో రెస్పాండ్ అవుతున్నారు.