అలియా భ‌ట్ 'పౌజీ'లో యువ‌రాణి!

వీలైనంత వేగంగా 'పౌజీ' పూర్తి చేసి త‌దుప‌రి సినిమాలు మొద‌లు పెట్టాల‌నే ధ్యాష‌తో ప్ర‌భాస్ ప‌ని చేస్తున్నాడు.

Update: 2025-02-15 13:08 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి ల‌వ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో 'పౌజీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వ‌కుండా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. వీలైనంత వేగంగా 'పౌజీ' పూర్తి చేసి త‌దుప‌రి సినిమాలు మొద‌లు పెట్టాల‌నే ధ్యాష‌తో ప్ర‌భాస్ ప‌ని చేస్తున్నాడు. పౌజీలో డార్లింగ్ కి జోడీగా అమ్మాన్వీ న‌టిస్తోంది. అమ్మ‌డు లాంచింగ్ రోజే కుర్రాళ్ల మ‌న‌సు దోచేసింది.

హీరోయిన్ గా చేసిన అనుభ‌వం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో అమ్మ‌డి ఫాలోయింగ్ చూసిన హ‌ను డార్లింగ్ కి ప‌ర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుందని దిగుమ‌తి చేసాడు. ఇక ఈ ల‌వ్ అండ్ వార్ లో హీరో-హీరోయిన్ మ‌ధ్య అంద‌మైన ప్రేమ క‌థ‌ని చెప్ప‌బోతున్నాడు. సినిమాలో ఎక్కువ‌గా హైలైట్ చేసేది ఈ అంశానే. ల‌వ్ స్టోరీలు తెర‌కెక్కించ‌డంలో హ‌ను స్పెష‌లిస్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి వార్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియాకి క‌నెక్ట్ చేస్తూ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టంతో ? మ‌రింత బ‌జ్ నెలకొంది.

ఈ నేప‌థ్యంలో సినిమా గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఇదే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కూడా న‌టిస్తుందిట‌. ఇందులో అమ్మ‌డు ఓ యువ‌రాణి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. సినిమా లో ఈ పాత్ర ఓ గెస్ట్ రోల్ లా క‌నిపించ‌నుదిట‌. ఫేమ‌స్ హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని అలియాభ‌ట్ ని సంప్ర‌దించ‌గా? అందుకు ఆమె కూడా అంగీక‌రిచిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

ఇదే నిజ‌మైతే పౌజీ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. అలియాభ‌ట్ ఎంట్రీ అన్న‌ది భారీ బ‌జ్ ని తీసుకొచ్చేదే. ఇప్ప‌టికే అమ్మ‌డు తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో సీత పాత్ర‌తో ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌రైంది. కాసేపు క‌నిపించే పాత్ర అయినా అమ్మ‌డు ఒదిగిపోయిన విధానానికి తెలుగు ఆడియ‌న్స్ ఫిదా అయ్యారు. తాజాగా పౌజీలోనూ ఎంట్రీ ఇస్తే తిరుగుండ‌దు.

Tags:    

Similar News