మెగా కోడ‌లు కొత్త కాపురం గురించి ఏమంటోంది!

వ‌రుణ్ తేజ్ ని వివాహం చేసుకుని లావ‌ణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-24 10:35 GMT

వ‌రుణ్ తేజ్ ని వివాహం చేసుకుని లావ‌ణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయోధ్య నుంచి హైద‌రాబాద్ కి సినిమా న‌టి అవ్వ‌డం కోసం వ‌చ్చిన లావ‌ణ్య కొనేళ్ల‌కి మెగా ఫ్యామిలీ ఇంట కొడ‌లై హైద‌రాద్ ని అంత్తింటిగా మార్చేసుకుంది. త‌న జీవితంలో ఇలాంటి స‌న్నివేశం ఎదుర‌వుతుంద‌ని తాను కూడా ఊహించి ఉండ‌దు. వివాహం అనేది ఎప్పుడు ఎవ‌రితో జ‌రుగుతుందో తెలి యదు. ఎవ‌రితో రాసి పెట్టి ఉంటే వారితోనే జ‌రుగుతుంది.

ఆ ర‌కంగా అనుకోకుండా లావ‌ణ్య వ‌రుణ్ తో ప్రేమ‌లో ప‌డ‌టంతో ఇదంతా సాధ్య‌మైంది. మ‌రి వివాహం త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమాలేవి క‌మిట్ అవ్వ‌లేదు. వివాహానికి ముందు క‌మిట్ అయిన ప్రాజెక్ట్ ల్ని మాత్ర‌మే పూర్తి చేస్తుంది. ఈ క్ర‌మంలో 'మిస్ ప‌ర్పెక్ట్' అనే వెబ్ సిరీస్ పూర్తి చేసింది. ఆ సిరీస్ రిలీజ్ ప్ర‌మోష‌న్ లోనూ లావ‌ణ్య పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎక్క‌డికి వెళ్లినా కొత్త కాపురం ఎలా ఉంది? మెగా ఫ్యామిలీతో బాండింగ్ ఎలా ఉంది అనే ప్ర‌శ్న కామ‌న్ గా ఎదుర‌వుతోంది.

వాటికి అంతే ఉత్సాహంతో లావ‌ణ్య బ‌ధులిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఆమె కాపురాన్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. లావణ్య త్రిపాఠి అనేది తాను కష్టపడి సంపాదించుకున్న పేరు అని... మెగా కోడలు అనే ట్యాగ్ తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. వరుణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఈ ట్యాగ్ వచ్చిందంది. మెగా కోడ‌లు అనే పిలుపు త‌న‌కోంతో ప్ర‌త్యేకంగా ఉంద‌ని అంది.

పర్ఫెక్షన్ అనేది పెద్ద సమస్య అని... దీని వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని అంది. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని.. వరుణ్ మాత్రం పర్ఫెక్షనిస్ట్ అని తెలిపింది. అలాగే పెళ్లి అయిన త‌ర్వాత సినిమాల విష‌యంలో అత్తింటి వారు ఎలాంటి కండీష‌న్లు పెట్ట‌లేద‌ని తెలిపింది. ఎలాంటి పాత్ర‌లు చేయాలి? ఎలాంటి పాత్ర‌లు చేయ‌కూడ‌దు వంటి విష‌యాలేవి అత్తింటి కుటుంబం త‌న‌తో ఎప్పుడూ చెప్ప‌లేద‌ని అంది. కెరీర్ ప‌రంగా అత్తింటి నుంచి అన్ని ర‌కాలుగా స‌హ‌కారం దొరుకుతంద‌ని తెలిపింది. మంచి కథ దొరికితే వరణ్ తో కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపింది.

Tags:    

Similar News