కాబోయే మెగా కోడలి డ్రెస్ పైనే కళ్లన్నీ!
కాబోయే జోడీ అందంగా అలకరించిన డెకరేషన్ మధ్య ఫోటో సెషన్ జరిగింది. చుట్టూ అందమైన రకరకాల రంగులతో కూడిన పువ్వులు
మెగాస్టార్ ఇంట కోడలిగా నటి లావణ్య త్రిపాఠి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మెగా వారసుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడుతుంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ తంతు కూడా పూర్తయింది. దీంతో లావణ్య అప్పుడే మెగా ఫ్యామిలీతో మిగిల్ అయిపోతుంది. తాజాగా కాబోయే దంపతులు మెగాస్టార్ ఇంట మెరిసారు. ప్రీవెడ్డింగ్ లో భాగంగా లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ ప్రత్యేక ఫోటో షూట్ లో పాల్గొన్నారు.
కాబోయే జోడీ అందంగా అలకరించిన డెకరేషన్ మధ్య ఫోటో సెషన్ జరిగింది. చుట్టూ అందమైన రకరకాల రంగులతో కూడిన పువ్వులు.. ఆ పువ్వులకు మ్యాచ్ అయ్యేలా లావణ్య ఎంపిక చేసుకున్న దుస్తులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. లేలేత పసుపు వర్ణం లోలావణ్య.. ఆ పక్కనే బ్లాక్ అండ్ బ్లాక్ లో వరుణ్ జోడీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఎత్తు మ్యాచింగ్ కష్టంగానే భావించాలి.
వరుణ్ హైట్ కి ...లావణ్య ఎత్తు ఏమాత్రం బ్యాలెన్స్ అవ్వడం లేదు. సినిమా షూటింగ్ తరహాలో ఎత్తుని బ్యాలెన్స్ చేసేలా ఇక్కడ ఎలాంటి ఛాయిస్ తీసుకోలేదు. నేచురల్ గానే ఫోటో సెషన్ నిర్వహిచినట్లు తెలుస్తోంది. మెగా దంపతులతో ఒక ఫోటో..మొత్తం కుటుంబ సభ్యులతో మరో ఫోటో కాబోయే దంపతులు దిగినట్లు తెలుస్తోంది. ఇక నెటి జనుల కళ్లన్నీ లావణ్య అందంగా ముస్తాబవ్వడంపైనే ఫోకస్ పెట్టారు.
నేచురల్ అందంతోనే కనిపిస్తుంది. పెద్దగా మ్యాకప్ వేసుకోలేదు. ఇక లేలేత పసువు డిజైన్ పై ఫ్యాషన్ ప్రియుల్ని మరింత ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా సంప్రదాయ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. మెగా అభిమానులు అడ్వాన్స్ గా విషెస్ తెలియజేస్తున్నారు.