ఆ హీరో కోసం ఏకంగా వంద కోట్లు?
లారెన్స్, ఎస్.జె.సూర్య లీడ్ రోల్ లో కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ జిగార్తాండ 2. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
లారెన్స్, ఎస్.జె.సూర్య లీడ్ రోల్ లో కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ జిగార్తాండ 2. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో లారెన్స్ కరుడుగట్టిన విలన్ గా నటిస్తూ ఉండగా అతనిపై సినిమా చేసే దర్శకుడిగా ఎస్.జె.సూర్య పాత్ర ఉండబోతోంది. యాక్షన్ అంశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతోందని తెలుస్తోంది.
చంద్రముఖి 2 తర్వాత లారెన్స్ చేస్తోన్న హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం. సైడ్ డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయిన లారెన్స్ దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా స్టార్ ఇమేజ్ ని ఆశ్వాదిస్తున్నాడు. పెద్ద పెద్ద సినిమాలలో లారెన్స్ హీరోగా చేస్తూ ఉండటం విశేషం.
చంద్రముఖి 2 సుమారు 50 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కార్తిక్ సుబ్బరాజు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రం జిగార్తాండ. ఆ సినిమా డైరెక్టర్ కి మంచి సక్సెస్ ఇవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండా పోయింది. స్టార్ డైరెక్టర్ గా కోలీవుడ్ లో కార్తిక్ సుబ్బరాజు గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తోన్న గేమ్ చేంజర్ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు స్టొరీ అందించారు. చాలా రోజుల తర్వాత కార్తిక్ సుబ్బరాజు దర్శకుడిగా తన మొదటి సినిమాకి సీక్వెల్, అది కూడా పూర్తి కొత్త కథతో చేస్తున్నాడు. ఈ సినిమాలో కథ డిమాండ్ చేయడంతో నిర్మాతలు భారీగానే ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్, ఇన్వెనియో ఆరిజిన్ పతాకాలపై కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్, ఎస్.కతిరేశన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ కోసం ఏకంగా వంద కోట్లు ఖర్చు పెట్టారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సినిమా విశేషాలు పంచుకున్నారు. కార్తిక్ సుబ్బరాజు నుంచి ఐదేళ్ళ తర్వాత థియేటర్స్ లో వస్తోన్న మూవీ జిగార్తాండ 2 అని నిర్మాతలు ఆన్నారు. దీపావళికి ఈ మూవీ థియేటర్స్ లో అలరించబోతోందని తెలిపారు.