లియోలో ఆ ఎపిసోడ్ కోసం ఏకంగా 15 కోట్లు
దీంతో పాటు ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడని విధంగా కాశ్మీర్ లో మంచు కొండల్లో హైనాలతో హీరో చేసే ఫైట్ సీక్వెన్స్ ని లోకేష్ డిజైన్ చేశాడు.
ఇళయదళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమైన ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి కచ్చితంగా రీచ్ అవుతాడని ఆడియన్స్ బలంగా నమ్ముతున్నారు. దళపతి విజయ్, త్రిష 14 ఏళ్ళ తర్వాత మరల ఈ మూవీలో జోడీగా కనిపిస్తున్నారు.
సంజయ్ దత్, అర్జున్ సర్జా లాంటి స్టార్ యాక్టర్స్ మూవీలో ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మూవీపై అంచనాలు పెంచింది. సినిమాపై ఇప్పటికే బిజినెస్ అయిపొయింది. నిర్మాతకి రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో యాక్షన్స్ సన్నివేశాలకి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసారంట. ముఖ్యంగా కార్ చేజింగ్ సీన్ కోసం కోట్ల రూపాయిల ఖర్చు పెట్టారు.
దీంతో పాటు ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడని విధంగా కాశ్మీర్ లో మంచు కొండల్లో హైనాలతో హీరో చేసే ఫైట్ సీక్వెన్స్ ని లోకేష్ డిజైన్ చేశాడు. కథలో భాగంగా వచ్చే ఈ సీక్వెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో ఎక్కువ ఖర్చు కూడా చేసిందంట. హైనాలతో పోరాట ఘట్టాన్ని ఆరంభంలోనే షూట్ చేసి విఎఫ్ఎక్స్ టీంకి ఇచ్చేశారు. ఈ సీన్ తర్వాత మిగిలిన షూటింగ్ అంతా చేసుకున్నారు.
అందుకే ఎక్కువ టైం దొరకడంతో అద్భుతంగా హైనాతో ఫైట్ సీక్వెన్స్ ని విఎఫ్ఎక్స్ నిపుణులు ఆవిష్కరించారు. ఈ 10 నిమిషాలు ఉండే ఈ సన్నివేశం కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు పెట్టారంట. ఓ విధంగా చెప్పాలంటే మినిమం రేంజ్ లో టైర్ 3 హీరో సినిమా కోసం పెట్టిన పెట్టుబడి కేవలం 10 నిమిషాల ఎపిసోడ్ కోసం లియో మూవీలో వాడేశారు. దీనిని బట్టి లోకేష్ ఎలాంటి విజన్ తో ఆ సీక్వెన్స్ ని సిద్ధం చేసి ఉంటాడో అంచనా వేయవచ్చు.
మూవీకి హైనాలతో ఫైట్ సీన్ హైలైట్ గా నిలుస్తుందంట. అలాగే కొత్త ఎక్స్ పీరియన్స్ కూడా ఇస్తుందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రాబోయే లియో మూవీ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి.