వీడియో: నడకలు నేర్చిన మెరుపుల మత్స్యం
ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టే హై హీల్స్ ధరించి, బోల్డ్ స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ తో ప్రత్యేకంగా ఆకర్షించింది.
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ డెబ్యూ చిత్రం `ది ఆర్చీస్` నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కి సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రివ్యూ వేదిక వద్ద సుహానాఖాన్ అద్భుతంగా కనిపించింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో అహూతుల కళ్లన్నీ సుహానా మిరుమిట్లపైనే. డెబ్యూ నటి రెడ్ కార్పెట్‌పై స్టన్నర్ అనిపించే రెడ్ బాడీకాన్ డ్రెస్‌లో మెరుస్తూ కనిపించింది. సుహానా గౌన్ మెరుపుల క్రిమ్సన్ ప్రవాహంలా నేలపై జారుతూ ఉంటే దానికోసం ఎంతో కేర్ తీసుకుంది. ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టే హై హీల్స్ ధరించి, బోల్డ్ స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ తో ప్రత్యేకంగా ఆకర్షించింది.
సుహానా లుక్ చాలా యూనిక్ గా ఉందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ స్టార్ స్టడెడ్ వేదిక వద్ద ఖాన్ నటవారసురాలు తన అందాన్ని ఎలివేట్ చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జారవిడువలేదు. సుహానా మిరుమిట్ల డ్రెస్ కి తగ్గట్టే అందమైన కేశాలంకరణ ఈ వేదికవద్ద చర్చగా మారింది. అయితే ఈ అలంకరణలో సహజ లక్షణాలను హైలైట్ చేసే స్మోకీ స్టైల్ ఎలివేషన్ రంజింపజేసింది.
వేదిక వద్ద ఎవరెవరు ఉన్నారు? అంటే.. ది ఆర్చీస్ తో నలుగురు డెబ్యూలు పరిచయమవుతున్నారు. అందుకే కొత్త తరం నటీనటులకు మద్దతుగా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రీమియర్ స్టార్-స్టడెడ్ ఈవెంట్ గా కొనసాగింది. వేదికవద్ద షారుఖ్ ఖాన్, రేఖ, జాకీ ష్రాఫ్, మలైకా అరోరా, పూజా భట్ సహా చాలా మంది ప్రముఖులు కనిపించారు. గల్లీ బోయ్స్ లాంటి క్లాసిక్ తో ప్రశంసలు పొందిన దర్శకురాలు జోయా అఖ్తర్ తెరకెక్కించిన `ది ఆర్చీస్` ఒక లైవ్-యాక్షన్ మ్యూజికల్ కామెడీ. ఇది భారత దేశంలో పాత్రలతో సాగుతుంది. క్లాసిక్ ఆర్చీ కామిక్స్‌కు ఇది రీమేక్.
సుహానా ఖాన్‌తో పాటు ఈ చిత్రంలో అగస్త్య నందా, ఖుషీ కపూర్, వేదంగ్ రైనా, మిహిర్ అహుజా, అదితి సైగల్, యువరాజ్ మెండా తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరో 48 గంటల్లో ది ఆర్చీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తన కుమార్తెకు మద్ధతుగా నిలుస్తూ షారుఖ్ ఖాన్ ది ఆర్చీస్ టీ-షర్ట్ ధరించడం ఈ వేదిక వద్ద మరో హైలైట్. ఖాన్ వారసుడు అబ్‌రామ్ కూడా ఈ వేదిక వద్ద కనిపించాడు.