అందరు తల్లుల్లాగే సందేహించిందట
అతడిని చూడగానే ప్రియాంక చోప్రా తల్లి గారు మధు చోప్రా కూడా అందరు మమ్మీల్లానే కూతురిని కట్టబెట్టేందుకు సందేహించిందట.
ఒకప్పుడు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపాలంటే తల్లిదండ్రులు చాలా కష్టపడేవారు. కానీ ఇప్పుడలా కాదు. పిల్లనివ్వాలంటే పెళ్లి చేసుకునేవాడి అర్హతను గుణగణాలను ఎక్కువగా చూస్తున్నారు. వరుడికి ప్రభుత్వోద్యోగం తప్పనిసరి. అందువల్ల పెళ్లి కాని ప్రసాదులు సంఘంలో పోగుబడుతున్నారు. అయితే ఈ జాబితాలో నిక్ జోనాస్ కూడా చేరేవాడే.. కానీ అతడు లక్కీ గయ్. అతడు మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రానే పెళ్లాడాడు.
అతడిని చూడగానే ప్రియాంక చోప్రా తల్లి గారు మధు చోప్రా కూడా అందరు మమ్మీల్లానే కూతురిని కట్టబెట్టేందుకు సందేహించిందట. అతడు సరైనవాడా కాదా? అన్న సందేహాలు తనకు కలిగాయని తెలిపింది. నిక్ జోనాస్ కి టెస్టులు కూడా పెట్టింది అత్తమ్మ.
ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ పెళ్లి స్వర్గంలో ఫిక్సయింది గనుక దీనిని ఎవరూ ఆపలేకపోయారు కానీ.. మధు చోప్రా చాలా టెన్షన్ పడ్డారట. ప్రతి తల్లిలాగే ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా కూతురి పెళ్లికి ముందు కాస్త సంశయించింది. ప్రియాంక- నిక్ జోడీపై అనుమానించింది. నిక్ జోనాస్ గురించి భయపడ్డానని మధు చోప్రా చెప్పింది.
ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుంటే తనకు చాలా దూరం అవుతుందని భయపడ్డానని మధు చోప్రా ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ పోర్టల్‌తో అన్నారు. అయినా కానీ అమెరికా నుంచి ఇండియా.. ఇండియా నుంచి అమెరికా ఎంత దూరమో లెక్కించింది. ఏ సమయంలో అయినా కానీ 15 గంటల్లో ఒకరినొకరు చేరుకోగలమని మధు చోప్రా అర్థం చేసుకుంది. ఇంకా తాను, తన కుటుంబం నిక్ జోనాస్‌ను వెంటనే ఇష్టపడ్డామని మధు వెల్లడించారు. నిక్‌తో మాత్రమే తాను సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. అతడిని ఒక వ్యక్తిగా తెలుసుకోవాలనుకుంది. అతడు ఎలాంటి వ్యక్తి అనేది నేరుగా చూడాలనుకుంది. అటుపై నిక్ జోనాస్‌తో చాట్ చేసిన తర్వాత, తన కుమార్తెకు నిక్ సరైన వ్యక్తి అని గ్రహించారట. ప్రియాంక కోసం నేను కోరుకున్నది నిక్ లాంటి యువకుడినే! అని మధు చోప్రా అన్నారు.
ప్రియాంక తన తాత (మధు జీ తండ్రి)తో చాలా సన్నిహితంగా ఉండేదని కూడా మధు చోప్రా వెల్లడించారు. నిజానికి మధు ప్రియాంకతో ఎక్కువ సమయం గడపలేదు. తన జీవితంలో కొన్ని తప్పటడుగులు వేసినందుకు తరచూ పశ్చాత్తాపపడతున్నానని చెప్పారు. అంతే కాదు ప్రియాంకకు ఏడేళ్ల వయసులో ఆమెను బోర్డింగ్ స్కూల్‌లో చేర్చామని మధు వెల్లడించారు. ఆమె తన భర్త ఆమోదం లేదా కుటుంబ ఆమోదం లేకుండా ఏదీ పొందలేదు. ప్రియాంకను బోర్డింగ్ స్కూల్‌లో చేర్చే ముందు మధు తన కూతురికి కౌన్సెలింగ్ కూడా ఇవ్వలేదు. అయితే పీసీ తనని విడిచి తాతయ్య అమ్మమ్మలతో ఉండటాన్ని కూడా తప్పు పట్టలేదు. ప్రియాంక PTSDతో ఎలా బాధపడుతుందో కూడా మధు చోప్రా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రియాంక చోప్రా రంగు గురించి ప్రతిసారీ కామెంట్లు ఎదురయ్యేవని కూడా మధు చోప్రా గుర్తు చేసుకున్నారు.