చిరంజీవిలా పవన్ కూడా ఆఛాన్స్ తీసుకుంటారా?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం సైన్యంలా తామంతా కలిసి పనిచేస్తామని ఓపెన్ గానే ప్రకటించారు.
జనసేనాని పిలవాలేగానీ మేం రంగంలోకి సిద్దమంటూ ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలంతా రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం సైన్యంలా తామంతా కలిసి పనిచేస్తామని ఓపెన్ గానే ప్రకటించారు. రామ్ చరణ్..సాయితేజ్..వైష్ణవ్ తేజ్ రెడీగా ఉన్నారు. బాబా య్ పిలవాలే గానీ నేను రానా? ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నానంటూ చరణ్ అభి మానులకు ఎప్పుడో హింట్ ఇచ్చేసారు.
ఇదే బాటలో మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా చిన్న మామ కోసం సిద్దంగానే ఉన్నాను. కానీ ఆయనే పిలవడం లేదంటూ నవ్వేసాడు ఓ సందర్భంలో. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా సేసానికి మద్దతుగా నిలిచినట్లు కొన్ని రకాల స్టేట్ మెంట్ల ద్వారా అర్దమవుతుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో చిరు వ్యాఖ్యలు ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక మెగా బ్రదర్ నాగబాబు కొన్నాళ్ల పాటు యాక్టివ్ గా అటుపై కాస్త సైలెంట్ గా ఉన్నా మళ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే.
ఇకపై యలమంచిలిలోనే ఉంటానంటూ ఇచ్చి న స్టేట్ మెంట్ ఆసక్తిని పెంచేస్తుంది. మరి సీటు ఆయనకు ఇస్తారా? లేదా? స్థానం అదేనా? ఇంకెక్కడినుంచైనా బరిలోకి దించుతారా? అన్నది తెలియదుగానీ నాగబాబు మాత్రం పై విధంగా కామెంట్ చేసారు. ఈ నేపథ్యంలో నాన్న రంగంలోకి దిగితే గనుక తనయుడు వరుణ్ తేజ్ కూడా సీన్ లోకి వస్తాడానే ప్రచారం మొదలైంది. నాన్నతో పాటు బాబాయ్ కి కూడా సహకరంగా ఉన్నట్లు గా ఉంటుందని భావించి ఇద్దరి తరుపున మెగాప్రిన్స్ ప్రచార బరిలోకి దిగే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇదే విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా బాబాయ్ పిలిస్తే గనుక కచ్చితంగా వెళ్తానని అన్నారు. మరి వీళ్లందర్నీ పవన్ కళ్యాణ్ తన కోసం పిలుస్తారా? లేక తనని తానే టీడీపీ కూటమితో కలిసి ప్రచారం చేసుకుంటారా? అన్నది తెలియాలి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఎన్నికల క్యాపెనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రభావం పెద్దగా అప్పటి ఎన్నికల్లో చూపలేదు. మరి ఈ సారి పవన్ కూడా చిరంజీవిలా ఆ ఛాన్స్ తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.