మళ్లీ బట్టలతోనే దీపిక మీదకి కుంపటి!
అటుపై 'ఫైటర్' చిత్రంలో అమ్మడు హృతిక్ తో వేసిన లిప్ లాక్ సన్నివేశాలు...బాడీ బాడీ టచ్చింగ్ సన్నివేశాలు కాస్త నెగిటివిటీని స్ప్రెడ్ చేసాయి.
హీరో ఎలా నటించిన పర్వాలేదు. కానీ హీరోయిన్ దుస్తుల్లో మాత్రం ఎలాంటి తేడాలున్నా! వివాదాలు తప్పవని ఎన్నో సందర్భాలు రుజువు చేసాయి. బేషరామ్ సాంగ్ విషయంలో దీపిక పదుకొణే ఎలాంటి విమర్శలు ఎదుర్కుందో తెలిసిందే. కాషాయ రంగు బికినీ ధరించి ఓ పార్టీ జెండానే అవమనించిందని విమర్శలు ఎదుర్కుంది. దీనిపై రోడ్డెక్కి నానా యాగీ చేసారు. చివరికి ఎలాగూ ఈవివాదం సద్దుమణిగింది.
అటుపై 'ఫైటర్' చిత్రంలో అమ్మడు హృతిక్ తో వేసిన లిప్ లాక్ సన్నివేశాలు...బాడీ బాడీ టచ్చింగ్ సన్నివేశాలు కాస్త నెగిటివిటీని స్ప్రెడ్ చేసాయి. చూస్తుంటే ఈ సన్నివేశం కూడా ముదురుతుందని. .వివాదం తెచ్చేలా ఉందని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ అందులో సినిమా లిబర్టీని దాటి చేయలేదు కాబట్టి ఛాన్స్ లేకుండాపోయింది! అని ఇప్పటివరకూ అంతా అనుకున్నారు.
కానీ దీపిక అక్కడ కూడా చిచ్చు పెట్టింది. మా మనోభావాలు దెబ్బ తీసిందని తాజాగా ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఏకంగా చట్టపరమయైన చర్యలకే దిగాడు. ఎయిర్ ఫోర్స్ సైనిక దుస్తుల్లో హృతిక్ రోషన్- దీపిక పదుకొణే లిప్ కిస్సు పెట్టుకోవడంపై ఓ అధికారి అభ్యంతరం వ్యక్తం చేసాడు. దీనికి సంబంధించి నేరుగా మేకర్స్ కి లీగల్ నోటీసులు పంపించాడు. ఇలా యూనిఫాంలో ముద్దులు పెట్టుకోవడం అన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టను దెబ్బ తీసినట్లు అని..ఆ రంగు దుస్తుల్లో అలాంటి పాడు పనులు చేయకూడదని పిటీషన్ లో పేర్కొన్నాడు.
ఈ సన్నివేశంపై మేకర్స్ వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపాడు. దీంతో మేకర్స్ ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన సన్నివేవం కనిపిస్తుంది. బేషరాం సాంగ్ పార్టీకి సంబంధించిన వివాదం కాబట్టి అది రాజకీయం అయింది. కానీ ఇది ఏకంగా సైనికుల మనోభావాల మీదనే దెబ్బ తీసిందని కేసు వేయడంతో ఇది మరింత ఆసక్తికరమైన అంశంగానే పరిగణించాల్సి వస్తోంది. మరి దీనిపై నిపుణులు..మేధా వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.