LCUలో చివరి సినిమా అదేనా!
ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో వచ్చి బాక్సాఫీస్‌పై ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించాడు.
లోకేష్ కనగరాజ్.. కొంత కాలంగా ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న డైరెక్టర్లలో ఇతడు ఒకడు. అంతలా ఇతడు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ తనదైన మార్కును చూపిస్తున్నాడు. అదే సమయంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ (LCU) అంటూ సరికొత్త పంథాలో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో వచ్చి బాక్సాఫీస్‌పై ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించాడు.
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘కూలీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో తీస్తున్నారు. అయితే, ఇది ఎల్‌సీయూకు చెందిన సినిమా మాత్రం కాదని లోకేష్ కనగరాజ్ చెప్పడం రజినీ ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.
ఇప్పుడు ‘కూలీ’ సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతోన్న లోకేష్ కనగరాజ్.. దీని తర్వాత మళ్లీ తన ఎల్‌సీయూలోనే మూవీ చేయబోతున్నాడు. ఇందులో భాగంగానే తన తదుపరి చిత్రంగా ‘ఖైదీ 2’ను తెరకెక్కిస్తానని ఇప్పటికే అతడు స్పష్టం చేసేశాడు. కార్తి హీరోగా వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఖైదీ’ మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. దీని తర్వాత కూడా అతడి లైనప్ గట్టిగానే ఉందని చెప్పొచ్చు.
కార్తితో ‘ఖైదీ 2’ను తెరకెక్కించిన తర్వాత ఎల్‌సీయూలో లోకేష్ కనగరాజ్ వరుసగా సూర్య ప్రధాన పాత్రలో ‘రోలెక్స్’, విశ్వనాయకుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్ 2’ చిత్రాలను తీయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, తన యూనివర్శ్‌లో ‘విక్రమ్ 2’నే చివరి చిత్రం అని కూడా లోకేష్ కనగరాజ్ తేల్చేశాడు. అయితే, ఈ చిత్రాలు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని కూడా అతడు చెప్పుకొచ్చాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్‌సీయూ చిత్రాల గురించి వివరించాడు. అదే సమయంలో ‘విజయ్ సార్ సినిమాల నుంచి రిటైర్ అవుతారని అస్సలు అనుకోలేదు. ఒకవేళ ఆయన సినిమాలు కంటిన్యూ చేసి ఉంటే నేను కచ్చితంగా లియో 2 మూవీని తెరకెక్కించేవాడిని. ఇప్పుడు ఎల్‌సీయూలో సినిమాలు చేస్తూనే మధ్యలో కొన్ని కొత్త కథలను కూడా చేయాలని అనుకుంటున్నా’ అని తెలిపాడు.
మొత్తానికి లోకేష్ కనగరాజ్ తన యూనివర్శ్‌లో చివరి చిత్రం ‘విక్రమ్ 2’ అని చెప్పడం అతడి అభిమానులను నిరాశలో ముంచేసింది. అయితే, అతడి నుంచి ‘కూలీ’ తరహాలో కొత్త కథలు వస్తాయని చెప్పడం వాళ్లలో కాస్త ఉపశమనం నింపిందని చెప్పుకోవచ్చు.