లొకేష్ క‌న‌గ‌రాజ్ ఇంత చ‌ప్ప‌గానా..ఊహించ‌లేదే!

అలాగే ఓ ఆరు నెల‌లు పాటు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో లియోపై ఆయ న చెప్పాల్సిన స‌మాధానం ఇదేన‌ని తేలిపోయింది.

Update: 2023-10-31 11:53 GMT

'లియో' చిత్రంపై వ‌చ్చిన నెగిటివ్ క‌థ‌నాల‌పై క‌చ్చితంగా స్పందిస్తాన‌ని ద‌ర్శ‌కుడు లొకేష్ కాన‌గరాజ్ ఒక‌టికి రెండు సార్లు నొక్కి వొక్కాణించి చెప్పిన సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ డే రోజున అటుపై కొన్ని రోజులు గ‌డిచిన త‌ర్వాత లియో కామెంట్ల‌పై త‌ప్ప‌కుండా త‌న స‌మాధానం ఉంటుంద‌ని అన్నాడు. అన్ని ర‌కాల కామెంట్లు ఆధారంగా చేసుకుని..ప‌రిశీలించి త‌న అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా చెబుతా అన్నారు.

దీంతో నెగిటివిటీపై లొకేష్ స‌మాధానం కూడా అంతే ధీటుగా ఉంటుంద‌ని... ఓకొత్త స‌మాధానం వ‌స్తుంద‌ని చాలా మంది ఊహించారు. కానీ ఇంత చ‌ప్ప‌గా స‌మాధానం ఇస్తాడ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. అవును తాజాగా లియో గురించి అలాగే స్పందించారు. లియో సినిమాపై కొంద‌రు కావాల‌నే నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని లోకేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. నెగిటివ్ రివ్యూల వెనుక కొంద‌రి హ‌స్తం ఉంద‌ని అన్నారు.

అలాగే ఓ ఆరు నెల‌లు పాటు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో లియోపై ఆయ న చెప్పాల్సిన స‌మాధానం ఇదేన‌ని తేలిపోయింది. లొకేష్ సాగ‌దీయ‌డం చూసి చాలా మంది ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇస్తాడ‌ని అనుకున్నారు. ఆరు నెల‌లు ఎలాగూ దూరంగా ఉంటాడు కాబ‌ట్టి ఈలోపు అన్ని ర‌కాల విమ‌ర్శ‌లు ప‌క్క‌కు పోతాయి. కాబ‌ట్టి లియో గురించి లొకేష్ నుంచి ఇంకెలాంటి వివ‌ర‌ణ రాద‌ని తేలిపోయింది.

ప్ర‌స్తుతం లోకేష్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో తెర‌కెక్కించనున్న ప్రాజెక్ట్ పై దృష్టి పెట్ట‌నున్నారు. సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపారు. అలాగే సినిమాలో ర‌జ‌నీకాంత్ లో నెగిటివ్ షేడ్ ని హైలైల్ చేస్తున్నాడుట‌. ఆయన పాత్ర లో వీల‌నీని కూడా డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై త‌న ఆలోచ‌న‌ల‌న్నీ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రం పైనే ఉంటాయ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News