లోకేష్ కనగరాజ్.. నెక్స్ట్ టార్గెట్ అంతకుమించి!
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అతనికి మంచి క్రేజ్ పెరిగింది. చేసిన ప్రతీ సినిమాతో బాక్సాఫీస్ నెంబర్లు పెంచుకుంటూ వెళుతున్నాడు.
కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ దూసుకుపోతున్నాడు. నగరం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కి కార్తితో చేసిన ఖైది మూవీ సూపర్ సక్సెస్ అందించి ఒక్కసారిగా అతని ఇమేజ్ ని మార్చేసింది. తరువాత వచ్చిన మాస్టర్, విక్రమ్ సినిమాలు అతన్ని స్టార్ దర్శకుడి రేంజ్ కి తీసుకొని వెళ్ళిపోయాయి. కమల్ హాసన్ తో చేసియన్ విక్రమ్ సినిమా కోలీవుడ్ లో నెక్స్ట్ లెవల్ సెన్సేషన్ అని చెప్పొచ్చు.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అతనికి మంచి క్రేజ్ పెరిగింది. చేసిన ప్రతీ సినిమాతో బాక్సాఫీస్ నెంబర్లు పెంచుకుంటూ వెళుతున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ సిరీస్ స్టోరీస్ లు లోకేష్ ఆవిష్కరిస్తున్నాడు.
అందులో భాగంగానే ఇళయదళపతి విజయ్ తో లియో చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకొని కూడా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అందుకుంది. కథలో చెప్పుకోదగ్గ వండర్స్ అయితే ఏవీ లేవనే మాట ఆడియన్స్ నుంచి వినిపించింది. అలాగే లోకేష్ గత సినిమాలతో పోల్చుకున్న లియో మూవీ ఆ స్థాయిలో లేదని విమర్శకుల నుంచి వచ్చిన మాట.
అయితే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ ఏడాది కోలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ 500 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోన్న మాట. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న మూవీ లియో అని అంటున్నారు.
ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక మామూలు స్టొరీతోనే లోకేష్ 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని లియోతో అందుకున్నాడని అర్ధం అవుతోంది. నెక్స్ట్ లోకేష్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రాబోతోంది. ఈ సినిమా గ్యారెంటీగా 600 కోట్లు దాటడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. విక్రమ్ 400 కోట్లు కలెక్ట్ చేస్తే, లియో 500 కోట్లు దాటింది. నెక్స్ట్ 600 కోట్లే అతని ముందున్న టార్గెట్ అని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.