లక్కీ భాస్కర్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది.

Update: 2024-10-31 05:54 GMT

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్ లో జరిగే స్కామ్స్ నేపథ్యంలో ఈ మూవీ కథని వెంకీ అట్లూరి చెప్పే ప్రయత్నం చేశారు. దానిని మిడిల్ క్లాస్ మెన్ లైఫ్ కి ఎడాప్ట్ చేసి డబ్బు మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుంది ఈ చిత్రంలో చూపించారు. దుల్కర్ సల్మాన్ కి జోడీగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి నటించింది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా 26.90 థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగులో అత్యధికంగా 14.20 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే తెలుగులో మూవీ బ్రేక్ ఈవెన్ రావాలంటే 15 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దుల్కర్ సల్మాన్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇది పెద్ద టార్గెట్ అని చెప్పొచ్చు.

అయితే సితార అలాంటి పెద్ద బ్యానర్, వెంకీ అట్లూరి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లక్కీ భాస్కర్ వెనుక ఉండటంతో సినిమాపై పబ్లిక్ అటెన్షన్ ఉంది. దుల్కర్ కూడా ‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘లక్కీ భాస్కర్’ తో స్ట్రైట్ గా తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అందుకే ఈ సినిమాపై భారీగా బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాపై మలయాళం 3.20 కోట్ల ప్రీరిలీజ్ వ్యాపారం జరిగింది.

తమిళనాడులో 1.5 కోట్ల వ్యాపారం అయ్యింది. 2 కోట్ల షేర్ ని తమిళంలో ‘లక్కీ భాస్కర్’ అందుకుంటే కమర్షియల్ సక్సెస్ అందుకుంటుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.50 కోట్ల థీయాత్రిల్ల్ బిజినెస్ అయ్యింది. ఓవర్సీస్ లో 4.50 కోట్ల వ్యాపారం ఐయినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా 26.90 కోట్ల బిజినెస్ ఈ చిత్రంపై జరగగా 28 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకుంటే మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది.

టార్గెట్ పెద్దదైన సినిమాకి వస్తోన్న పాజిటివ్ ఆదరణ నేపథ్యంలో కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయని అనుకుంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే నెక్స్ట్ టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ కి సినిమాలకి మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News