లక్కీ భాస్కర్.. నెట్ ఫ్లిక్స్ లో కూడా సంచలనమే..

సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించటమే కాదు, ఓటీటీలోనూ దూసుకుపోతున్న చిత్రం లక్కీ భాస్కర్.

Update: 2025-02-26 19:05 GMT

సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించటమే కాదు, ఓటీటీలోనూ దూసుకుపోతున్న చిత్రం లక్కీ భాస్కర్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ తో దుల్కర్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. 13 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ లిస్ట్‌లో కొనసాగిన తొలి దక్షిణాది సినిమా గా నిలిచింది.

ఇటీవల విడుదలైన ఎన్నో పాన్ ఇండియా సినిమాలు ఓటీటీలో సక్సెస్ అయినా, అంతటి నిలకడను కొనసాగించిన సినిమాలు చాలా తక్కువ. కానీ లక్కీ భాస్కర్ మాత్రం భారీ రెస్పాన్స్‌తో ఏకంగా మూడు నెలల పాటు నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండ్స్‌లో కొనసాగింది. సినిమా కథ, కథనం, దుల్కర్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఓటీటీలో మరో స్థాయికి తీసుకెళ్లాయి.

థియేట్రికల్‌గా విజయవంతమైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి దుల్కర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు అదే ఊపును నెట్‌ఫ్లిక్స్‌లో కొనసాగిస్తూ, సౌత్ ఇండస్ట్రీ సినిమాల హవాను అంతర్జాతీయ స్థాయిలో చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుండటంతో, నెట్‌ఫ్లిక్స్ మేనేజ్‌మెంట్ కూడా ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది.

సినిమా ప్రీమియర్ అయిన వెంటనే, 15 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 లిస్ట్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతే కాదు, 17.8 బిలియన్ నిమిషాల స్ట్రీమింగ్‌తో రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఇది దక్షిణాది సినిమాలలో ఒకటిగా చూస్తే అనూహ్యమైన రికార్డ్. ప్రస్తుతం 13 వారాల ట్రెండింగ్ రికార్డుతో, సౌత్ ఇండియా సినిమాలకు ఓటీటీలో భారీ మార్కెట్ ఉందని మరోసారి రుజువు చేసింది.

ఈ ఘనతను సాధించినందుకు చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతలు, దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో దుల్కర్, ఇతర నటీనటులు ఈ విజయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంకా ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యారా? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ విజువల్ మాస్టర్‌పీస్‌ను వెంటనే చూడండి.

Tags:    

Similar News