రుక్మిణిని ఆపడం కష్టమే ఇక..!

కన్నడలో సప్త సాగర దాచె ఎల్లో సినిమా చేసిన రుక్మిణి ఆ సినిమా తెలుగు వెర్షన్ సప్త సాగరాలు దాటితో మెస్మరైజ్ చేసింది.

Update: 2025-02-26 19:11 GMT

కన్నడ భామలకు తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ మొత్తం షేక్ చేస్తున్న రష్మిక మందన్న కూడా కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి టాలీవుడ్ లో పాపులర్ అయ్యాకే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంది. రష్మిక దారిలోనే మరికొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ బాట పడుతున్నారు. అందులో తన క్యూట్ లుక్స్ తో ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ మనసులు కాజేసిన రుక్మిణి వసంత్ కూడా ఉంది. కన్నడలో సప్త సాగర దాచె ఎల్లో సినిమా చేసిన రుక్మిణి ఆ సినిమా తెలుగు వెర్షన్ సప్త సాగరాలు దాటితో మెస్మరైజ్ చేసింది.

ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా రుక్మిణికి మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది. ఐతే అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా సైలెంట్ గా నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే అది ఎలా వచ్చిందో అలా వెళ్లింది. ఇక లేటెస్ట్ గా అమ్మడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్. ఎన్టీఆర్ నీల్ సినిమాకు రుక్మిణి దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే లెక్క.

ఐతే అమ్మడు ఆ సినిమా చేస్తే మాత్రం తప్పకుండా నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనేలా ఉంటుందని చెప్పొచ్చు. రుక్మిణి కూడా టాలీవుడ్ టాప్ చెయిర్ మీదే కన్నేసినట్టు తెలుస్తుంది. తారక్ తో ఛాన్స్ అది కూడా ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి సినిమా ఎలా లేదన్నా అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. ఐతే ఈ సినిమా ఓకే అవ్వడమే ఆలస్యం రుక్మిణి కోసం తెలుగు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే రుక్మిణి మరో సినిమా సైన్ చేయలేదని తెలుస్తుంది. ఐతే తారక్ సినిమా పూర్తై రిలీజ్ అయితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్లా కాదనిపించేలా క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ యూత్ అంతా అమ్మడి మాయలో పడిపోగా ఎన్టీఆర్ సినిమాతో టాప్ రేంజ్ కి వెళ్లబోతుంది. సో టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ వచ్చినట్టే అని సౌడ్ చేయాల్సిందే అని చెప్పొచ్చు.

Tags:    

Similar News