మిస్టర్ బీస్ట్: యూట్యూబ్ చరిత్రలో తొలి బిలియనీర్!
యూట్యూబ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ (అలియాస్ జిమ్మీ డోనాల్డ్సన్) మరో అరుదైన ఘనత సాధించారు.
యూట్యూబ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ (అలియాస్ జిమ్మీ డోనాల్డ్సన్) మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి, 367 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించిన ఈ స్టార్ యూట్యూబర్, తాజాగా బిలియనీర్ (రూ. 8700 కోట్లు) ట్యాగ్‌ను దక్కించుకున్నారు.
-బిలియనీర్‌గా మిస్టర్ బీస్ట్
సెల్ఫ్-మేడ్ కంటెంట్ క్రియేటర్‌గా మారిపోయిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్, కేవలం తన వినూత్నమైన వీడియోలు, సోషల్ వర్క్, బిజినెస్ వ్యాపారాలతోనే ఈ స్థాయికి చేరుకున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మిస్టర్ బీస్ట్ ఇప్పుడు యూట్యూబ్ చరిత్రలో తొలి బిలియనీర్ (రూ. 8700 కోట్లు) కంటెంట్ క్రియేటర్‌గా నిలిచారు.
-ఎంత సంపాదన..? ఎంత పెట్టుబడి?
బిలియనీర్ అయినప్పటికీ తన బ్యాంక్ ఖాతాలో మాత్రం 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువే ఉందని మిస్టర్ బీస్ట్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను సంపాదించే ప్రతి డాలరును తిరిగి కొత్త ప్రాజెక్టులు, ఛానెల్ అభివృద్ధి, చారిటీలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటానని చెప్పారు.
- మిస్టర్ బీస్ట్ సక్సెస్ కు కారణాలు
మిస్టర్ బీస్ట్ వీడియోలు వినోదాత్మకంగా ఉండటమే కాకుండా సామాజిక సేవకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తాయి. అతను లక్షలాది డాలర్లను విన్నింగ్ ఛాలెంజ్‌లు, దాతృత్వ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. అందుకే అంతలా పాపులారిటీ సంపాదించారు. దాంతోపాటు అతడికి యూట్యూబ్ ఇతర మాధ్యమాల ద్వారా అంతే మొత్తం డబ్బు వచ్చి పడుతోంది. తద్వారా తొలి బిలియనీర్ గా అవతరించాడు. తను సంపాదించేది అంతా సామాజిక కార్యక్రమాలకే వెచ్చిస్తూ ఖ్యాతి గాంచాడు.
- భవిష్యత్తు ప్రణాళికలు
ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్, చాక్లెట్ బ్రాండ్ "ఫీస్టబుల్స్," మరెన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన మిస్టర్ బీస్ట్, భవిష్యత్తులో మరిన్ని విస్తృత ప్రాజెక్టులపై దృష్టి పెడతానని తెలిపారు.
యూట్యూబ్‌లో కేవలం వీడియోలు తయారు చేస్తూ బిలియనీర్ అయ్యాడంటే నమ్మలేకుండా ఉన్నా... మిస్టర్ బీస్ట్ మాత్రం అది నిజం చేసుకున్నారు. వ్యాపార పరిజ్ఞానం, కంటెంట్ మేనేజ్‌మెంట్, సామాజిక సేవను సమపాళ్లలో నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ భవిష్యత్తులో ఇంకెన్నో రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.