దేవర సెంటిమెంట్‌ను నీల్ సినిమా కంటిన్యూ చేస్తుందా?
దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్న తారక్, ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది. అప్పటివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా ఉన్న తారక్, ఆర్ఆర్ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్న తారక్, ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు అంటున్నారు.
హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఎన్నో అంచనాలున్నాయి. ప్రస్తుతం వార్2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, త్వరలోనే దానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుని, తన తర్వాతి సినిమాపై దృష్టి సారించాలని చూస్తున్నాడు.
వార్2 తర్వాత ఎన్టీఆర్, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని పార్ట్ ను షూటింగ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. మార్చి లో జరగనున్న నెక్ట్స్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నట్టు యూనిట్ సభ్యులంటున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. దేవర సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బీచ్ సన్నివేశాలున్నాయట. దాని కోసం నీల్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఓ బీచ్ లొకేషన్ ను కూడా పరిశీలించి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బీచ్ సీన్స్ ఉన్న దేవర బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు ఈ సినిమా కూఆ బ్లాక్ బస్టర్ అయి, ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.