ఫంకీ జాతిరత్నాలు మించి..!

ఐతే ఈ సినిమా తర్వాత అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.

Update: 2025-02-26 19:12 GMT

అనుదీప్ కెవి డైరెక్షన్ లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్ లో తెరకెక్కిన జాతిరత్నాలు ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఐతే ఈ సినిమా తర్వాత అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.

ఇక అనుదీప్ నెక్స్ట్ సినిమా విశ్వక్ సేన్ తో ఫంకీ అంటూ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా మరో జాతిరత్నాలు అవుతుందా అని ఆడియన్స్ అంటుంటే అంతకుమించి అనేస్తున్నారు చిత్ర యూనిట్. అనుదీప్ రైటింగ్ లోనే కామెడీ అదిరిపోతుంది. అతను మాట్లాడుతున్నా కూడా అలానే ఉంటుంది. జాతిరత్నాలు సినిమా తర్వాత అనుదీప్ కనిపిస్తే చాలు ఒక యూత్ హీరో రేంజ్ కేకలు వినిపిస్తాయి.

ఐతే ఆడియన్స్ తన మీద పెట్టుకున్న అంచనాలను మిస్ ఫైర్ అవ్వకూడదు అనుకుని ప్రిన్స్ తర్వాత మరో కథ కోసం కొంత టైం తీసుకున్న అనుదీప్ ఫంకీతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐతే విశ్వక్ సేన్ కూడా వరుస సినిమాలు నిరాశపరచడంతో ఈసారి హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. అనుదీప్ విశ్వక్ సేన్ ఈ కాంబో కచ్చితంగా ఆడియన్స్ కు మంచి ఫన్ ఫీస్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమా అదిరిపోయే ఫన్ ఉందని అనుకుంటున్నారు. సో తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. అనుదీప్ కెవి ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుండగా విశ్వక్ సేన్ మాత్రం తప్పకుండా ఒక సూపర్ హిట్ కొట్టేలా ఫంకీని సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. మరి అనుదీప్ ఫంకీ విశ్వక్ ని హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. లాస్ట్ ఇయర్ 3 సినిమాలు ఈ ఇయర్ లైలా తో వచ్చినా సరే విశ్వక్ ఎందుకో తను అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోవట్లేదు. ఐతే ఫంకీ ని మాత్రం అలా తేలికగా తీసుకోకుండా సినిమా మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తుంది. అనుదీప్ సినిమా అంటే యూత్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యేందుకు రెడీగా ఉంటారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News