క్లింకారా వీడియో షేర్ చేసిన ఉపాసన..!

మెగా కోడలు ఉపాసన కొణిదెల తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

Update: 2025-02-26 19:06 GMT

మెగా కోడలు ఉపాసన కొణిదెల తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అకేషన్స్ ఏవైనా సరే ఉపాసన పెట్టే స్పెషల్ మెసేజ్ ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ ట్రీట్ అందిస్తుంది. లేటెస్ట్ గా తన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా ఉపాసన ఒక స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ఆమె ఒక మెసేజ్ కూడా పెట్టింది. 40 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా నాన్న మాపై మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆమె రాసుకొచ్చారు.

అంతేకాదు ఈ వీడియోలో రాం చరణ్ క్లింకారా కూడా ఉన్నారు. ఎప్పటిలానే క్లింకారా ఫేస్ చూపించకుండానే వీడియో షేర్ చేశారు ఉపాసన. మెగా కోడలిగానే కాదు ఉమెన్ బిజినెస్ మెన్ గా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు ఉపాసన. ప్రతి విషయంలో తన అభిరుచితో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది ఉపాసన.

ఇక మెగా ఇంటి కోడలిగా వెళ్లాక తానెంత బిజినెస్ మెన్ అయినా కూడా ఎంతో చక్కగా ఫ్యామిలీని రన్ చేస్తుంది. అంతేకాదు చరణ్ సక్సెస్ లో కూడా ఆమె భాగమై ఉన్నారు. హీరోగా చరణ్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో ఉపాసన మిగతా పనులన్నిటినీ చక్కదిద్దుతుంది. చరణ్ ఉపాసనల గారాలపట్టి క్లింకారా ని చూడాలని మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే మెగా వారసురాలిని మాత్రం చూపించడానికి ఇంకా ముహూర్తం బయట పడలేదు.

ఉపాసన బిజినెస్ ఉమెన్ గా బిజీగా ఉంటుండగా చరణ్ తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈమధ్యనే గేం ఛేంజర్ సినిమా చేసిన రామ్ చరణ్ నెక్స్ట్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ రెండు సినిమాలు మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తాయని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. RRR తో గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న చరణ్ రాబోయే సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. బుచ్చి బాబుతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్నాడు. ఆ సినిమా పీరియాడికల్ డ్రామాగా అదిరిపోతుందని అంటున్నారు.

Tags:    

Similar News