మ్యాడ్ స్వ్కేర్ అస‌లు స‌ర్‌ప్రైజ్ వేరే ఉంద‌ట!

అయితే ఈ రెండు సినిమాల‌కీ మంచి బ‌జ్ ఉంది. ముందుగా రాబిన్‌హుడ్ మూవీ గురించి మాట్లాడుకుంటే...;

Update: 2025-03-20 12:30 GMT

టాలీవుడ్ లో వ‌చ్చే వారం రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవి రాబిన్‌హుడ్ మ‌రియు మ్యాడ్ స్వ్కేర్ సినిమాలు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాబిన్‌హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా న‌టించ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది. మార్చి 27న రాబిన్‌హుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక రెండో సినిమా మ్యాడ్ స్వ్కేర్. నార్నే నితిన్, సంగీత్ శోభ‌న్, రామ్ నితిన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా కామెడీ అండ్ యూత్ ఫుల్ ఎంట‌ర్టైనర్ మ్యాడ్ కు సీక్వెల్ గా తెర‌కెక్కింది. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో నాగ‌వంశీ నిర్మించారు. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కానుంది.

అయితే ఈ రెండు సినిమాల‌కీ మంచి బ‌జ్ ఉంది. ముందుగా రాబిన్‌హుడ్ మూవీ గురించి మాట్లాడుకుంటే అప్ప‌టివ‌ర‌కు ఉన్న క్రేజ్ ను అదిదా స‌ర్‌ప్రైజు సాంగ్ తో కేతిక శ‌ర్మ ఒక్క‌సారిగా పెంచేసింది. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆ సాంగ్ కు సంబంధించిన రీల్సే క‌నిపిస్తున్నాయంటే ఆ సాంగ్ సినిమాకు ఎంత ప్ల‌స్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక మ్యాడ్ స్వ్కేర్ విష‌యానికొస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ ఎంట‌ర్టైన‌ర్ కు సీక్వెల్ గా వ‌స్తున్న మూవీ కావ‌డంతో దీనికి ఆల్రెడీ మంచి హైపే ఉంది. అంతేకాదు రాబిన్‌హుడ్ త‌ర‌హాలోనే మ్యాడ్ స్వ్కేర్ లో కూడా ఓ స‌ర్‌ప్రైజ్ ఉంద‌ట‌. కావాల‌నే మేక‌ర్స్ దాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. ఆ స‌ర్‌ప్రైజ్ మ‌రేదో కాదు, మ్యాడ్ స్వ్కేర్ లో ప్రియాంక జవాల్క‌ర్ ఓ స్పెష‌ల్ రోల్ లో క‌నిపించ‌డంతో పాటూ స్పెష‌ల్ సాంగ్ లో మెర‌వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ట్యాక్సీవాలా, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం, డీజే టిల్లూ సినిమాల్లో క‌నిపించి మెప్పించిన ప్రియాంక ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్ లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. కావాల‌నే చిత్ర యూనిట్ ఆ సాంగ్ ను ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేయ‌లేద‌ని, ట్రైల‌ర్ కు కొంచెం ముందుగా ఆ సాంగ్ ను రిలీజ్ చేసి సినిమాపై ఉన్న బ‌జ్ ను ఒక్క‌సారిగా పెంచాల‌ని చూస్తున్నాడ‌ట నిర్మాత నాగ‌వంశీ. మ‌రి ఈ స‌ర్‌ప్రైజ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సాంగ్ కూడా ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేస్తే రెండు సినిమాల‌కీ చాలా ట‌ఫ్ కాంపిటీష‌న్ ఉండే ఛాన్సుంది.

Tags:    

Similar News