ఈ రోజుల్లో పిల్లలను చూసి జాలిపడుతున్నాను: మాధ‌వన్

ఇండియాలో 70ల‌లో జన్మించిన వారిని నేను స‌మర్థిస్తాను. ఈ రోజు ప్రపంచంలోని అందరు CEOలను చూడండి. వీరంతా భారతదేశంలో 70-80లలో జన్మించారు.

Update: 2024-09-07 04:26 GMT

70లలో అంత ధనవంతులు లేని భారతదేశంలో పిల్ల‌లు ఎలా ఉండేవారు? వృద్ధి ఎలా ఉండేది? 54 ఏళ్ల నటుడు మాధ‌వ‌న్ నేటిత‌రంతో పోలుస్తూ అప్ప‌టి పిల్ల‌లు ఎలా గ్రేట్? అన్న‌ది వివ‌రించిన తీరు ఆక‌ర్షిస్తోంది. రణ్‌వీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్‌లో అత‌డు ఇలా వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత పిల్ల‌ల‌ను నా ధృక్కోణంలో చూస్తున్నాను.

నేను వారి విష‌యంలో చాలా జాలిపడుతున్నాను. చెట్లు ఎక్కడం.. టాడ్‌పోల్‌లు పట్టుకోవడం.. గొడవలు పడటం, గొడవల నుండి బయటపడటంలో మా రోజులే గొప్ప‌. అహంకారాన్ని, గర్వాన్ని మింగేసుకుని క్షమించండి అన్నయ్య.. మ‌న‌ తగాదాలలో తల్లిదండ్రులు జోక్యం దేనికి? అని మాట్లాడుకునేవాళ్లం.. కానీ ఇప్పటి పిల్ల‌లు అలా కాదు! అని అన్నారు.

ఇండియాలో 70ల‌లో జన్మించిన వారిని నేను స‌మర్థిస్తాను. ఈ రోజు ప్రపంచంలోని అందరు CEOలను చూడండి. వీరంతా భారతదేశంలో 70-80లలో జన్మించారు. వారు మరే ఇతర దేశానికి చెందినవారు కాదు. మేం నిజంగా సరైనది చేసాము. ఈ రోజు ప్రతి విజయవంతమైన ప్రభావవంతమైన సంపాద‌నాప‌రులైన‌ భారతీయుల‌ను చూడండి. వారు మా తరానికి చెందినవారు. మేం ఏదో సరిగ్గా చేసాము! అని మాధవన్ అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మాధవన్ ఇటీవల 'ధోఖా: రౌండ్ డి కార్నర్', 'షైతాన్' చిత్రాల్లో కనిపించారు. షైతాన్ లో మ్యాడీ మ‌రో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చార‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆయన తదుపరి చిత్రం అమ్రికి పండిట్-అదృష్టశాలి-దే దే ప్యార్ దే 2-శంకర-ధురంధర్ విడుద‌ల‌కు రావాల్సి ఉంది.

Tags:    

Similar News