చెన్నై దుబాయ్‌లోనే కాదు మ్యాడీకి ముంబైలోను ఆస్తులు
నటుడిగా అతడి సెకండ్ ఇన్నింగ్స్ చాలా బిజీగా మారింది.
మాధవన్ అలియాస్ మ్యాడీ పరిచయం అవసరం లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అగ్రశ్రేణి స్టార్లలో ఆయన ఒకరు. అతడు స్వయంకృషితో కష్టపడి పైకి వచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా మాధవన్ ఎంపికలు అతడి స్థాయిని ఎలివేట్ చేస్తూనే ఉన్నాయి. నటుడిగా అతడి సెకండ్ ఇన్నింగ్స్ చాలా బిజీగా మారింది.
మ్యాడీ అధిక బరువు సమస్య నుంచి కూడా సులువుగా బయటపడగలడు. అతడు లేటెస్ట్ మేకోవర్ ని షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి శారీరక శ్రమ, జిమ్ అవసరం లేకుండా బరువు తగ్గానని వెల్లడించి షాకిచ్చాడు. నటుడిగా మ్యాడీ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. కెరీర్లో వరుస సినిమాల్లో నటిస్తూ చాలా డబ్బు సంపాదించాడు. వాటిని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాడు. తాజా అప్డేట్ ప్రకారం.. మాధవన్ ముంబైలోని ఖరీదైన BKC ప్రాంతంలో 18 కోట్లకు కొత్త ఫ్లాట్‌ని కొనుగోలు చేసాడు.
ఈ ఫ్లాట్ 4182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రెండు కార్ల పార్కింగ్ కి ఆస్కారం ఉంది. ఈ ముంబై ఫ్లాట్‌తో పాటు మాధవన్ ఇప్పటికే చెన్నైలో 15 కోట్ల విలువైన బంగ్లాలో నివశిస్తున్నాడు. అలాగే విలాసాల దుబాయ్‌లో సొంతంగా ఫ్లాట్ ను కొనుగోలు చేసాడు. 100 కోట్లు పైగా ఆస్తులు కలిగి ఉన్న సౌతిండియన్ స్టార్ గా అతడు రికార్డుల్లో ఉన్నాడు.
మాధవన్ చివరిసారిగా సూపర్ హిట్ హిందీ చిత్రం `షైతాన్`లో నటించాడు. ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం మాధవన్ అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోను అతడు పాత్ర ప్రాధాన్యతను బట్టి నటించేందుకు అంగీకరిస్తున్నాడు.