ఈ వారం 'మ్యాడ్' డామినేషన్

మ్యాడ్ టాక్ బాగుండటంతో థియేటర్స్ సంఖ్యని పెంచేపనిలో నిర్మాతలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన సినిమా అంటే మ్యాడ్ అని చెబుతున్నారు.

Update: 2023-10-07 12:11 GMT

ఈ వారం సిల్వర్ స్క్రీన్ పై ఏకంగా ఆరు సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. కొత్తవాళ్లతో సితారా ఎంటర్టైన్మెంట్స్ చేసిన మ్యాడ్ మూవీతో పాటు సుదీర్ బాబు మామా మశ్చీంద్ర, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్, నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు. సిద్ధార్ద్ చిన్నా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్క మ్యాడ్ మూవీ తప్ప ఏ ఒక్కటి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయలేదని చెప్పాలి.

మ్యాడ్ మూవీ కథ పరంగా రొటీన్ అయిన ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రివ్యూలు కూడా ఈ చిత్రానికి పాజిటివ్ గా రావడం విశేషం. ఈ చిత్రంతో పోల్చుకుంటే మిగిలిన సినిమాలన్నీ ఎంతో కొంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి.

మొదటి రోజే మ్యాడ్ సినిమా బ్రేక్ ఎవెన్ టార్గెట్ కి సగం కలెక్షన్స్ వచ్చేశాయి. మ్యాడ్ కి ఆడియన్స్ రద్దీ పెరగడంతో పాటు మిగిలిన సినిమాలకి అస్సలు టికెట్ లు తెగకపోవడం వలన చాలా షోలు రద్దయ్యాయని తెలుస్తోంది. ఆ సినిమాల స్థానంలో కొన్ని చోట్ల మ్యాడ్ షోలు వేస్తే మరికొన్ని థియేటర్స్ లో జవాన్, స్కంద మూవీస్ ని వేసారంట.

మ్యాడ్ టాక్ బాగుండటంతో థియేటర్స్ సంఖ్యని పెంచేపనిలో నిర్మాతలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన సినిమా అంటే మ్యాడ్ అని చెబుతున్నారు. వీటితో పాటుగా హిందీలో రిలీజ్ అయిన మిషన్ రాణిగంజ్, దోనో, ఎక్సోరిస్ట్ బిలివర్స్ మూవీస్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఓవరాల్ గా ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలలో కేవలం మ్యాడ్ మూవీ మాత్రమే సక్సెస్ ఫుల్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మొత్తానికి కాస్తా ఫేమ్ ఉన్న హీరోలని సైతం బీట్ చేసుకొని కొత్తవాళ్లతో వచ్చిన చిన్న సినిమా ఈ వారం ముందుకి దూసుకుపోతుంది.

Tags:    

Similar News