థియేట‌ర్ లో రిజ‌ల్స్ట్ ఏపీలో పెడితే దుమ్ము లేచేది!

దేశ‌మంతా ఎన్నిక‌లు ఒక ఎత్తైతే ఏపీ మ‌రో ఎత్తు. ఈసారి ప‌ల్నాడు ఘ‌ట‌న త‌ర్వాత రెండు పార్టీల మ‌ధ్య స‌న్నివేశం మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది.

Update: 2024-06-01 06:19 GMT

సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌డి ముగింపు ద‌శకు చేరుకుంది. నేటితో చివ‌రి విడ‌త పోలింగ్ ముగుస్తుంది. దీంతో దేశ ప్ర‌జ‌ల క‌ళ్ల‌న్నీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైనే. ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు వెలువ‌డ‌తాయి. జూన్ 4న లెక్కింపు నేప‌థ్యంలో ఉత్కంఠ మ‌రింత పెరుగుతుంది. ఆరోజున యావ‌త్ దేశం టీవీల‌కు..ఫోన్ల‌కు అతుక్కుపోతారు. అదే ఎన్నిక‌ల ఫ‌లితాలు బిగ్ స్క్రీన్ లో క‌నిపిస్తే ఆకిక్కే వేరు క‌దా. అందుకు మ‌హ‌రాష్ట్ర‌లో కొన్ని థియేట‌ర్లు ఈ ఫ‌లితాల్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నాయి.

ముంబైలోని ఎస్ ఎంబీ5, క‌ళ్యాణ్‌, సియాన్, కుంజుమార్గ్ లోని మూవీ మ్యాక్స్ థియేట‌ర్లు, థానేలోని ఎట‌ర్నిటీ మాల్, వండ‌ర్ మాల్, నాగ‌పూర్ లోని మూవీ మ్యాక్స్ ఎట‌ర్నిటీ, పూణేలోని మూవీ మ్యాక్స్ త‌దిత‌ర థియేట‌ర్ల‌లో లైవ్ ప్ర‌సారం కానున్నాయి. ఆరు గంటల పాటు ఫ‌లితాల‌ను థియేట‌ర్లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఇందుకోసం టికెట్ ధ‌ర‌ని 99 నుంచి 300ల వ‌ర‌కూ ఉన్నాయి. ఇప్ప‌టికే కొన్ని థియేట‌ర్లు హౌస్ ఫుల్ అయిన‌ట్లు స‌మాచారం.

అయితే ఇలాంటి అవ‌కాశం ఏపీ వాసుల‌కు ఉంటే ఆలెక్క మ‌రోలా ఉండేది. దేశ‌మంతా ఎన్నిక‌లు జ‌రిగినా ఏపీ ఫ‌లితాలపైనే అంద‌రి ఉత్కంఠ ఉంది. అందులోనూ ఏపీ-తెలంగాణ ప్ర‌జ‌లు ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌ని ఎన్నిక పూర్త‌యిన ద‌గ్గ‌ర ఉంచి ఎంతో ఆస‌క్తి గా ఎదురుచూస్తున్నారు. రోజులు..గంట‌లు లెక్క పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా థియేట‌ర్ల లో లైవ్ రిజ‌ల్స్ట్ ఇచ్చి ఉంటే? ఆ లెక్క వేరేలా ఉండేది.

అయితే ఇక్క‌డ గొడ‌వ‌లు జ‌ర‌గ‌డానికి ఆస్కారం ఎక్కువ‌. దేశ‌మంతా ఎన్నిక‌లు ఒక ఎత్తైతే ఏపీ మ‌రో ఎత్తు. ఈసారి ప‌ల్నాడు ఘ‌ట‌న త‌ర్వాత రెండు పార్టీల మ‌ధ్య స‌న్నివేశం మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. ఆఘ‌ట‌న‌తో ఏపీ దేశ‌వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఫ‌లితాల రోజున అల్ల‌ర్లు చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని ప‌టిష్ట భ‌ద్ర‌త ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో థియేట‌ర్లో లైవ్ స్ట్రీమ్ ఇస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఇక్క‌డ అలాంటి అనుమ‌తులు లేవు.

Tags:    

Similar News