మహేష్ కి 100.. మరి రాజమౌళికి..?

కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్న విషయంపై క్లారిటీ రాలేదు కానీ మహేష్ రాజమౌళి రెమ్యునరేషన్ డీటైల్స్ ఐతే హింట్స్ వచ్చాయి.

Update: 2024-02-17 03:30 GMT

తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ సినిమాల స్థాయిలో నిలబెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత తను చేస్తున్న సినిమా గురించి అదిరిపోయే ప్లానింగ్ లో ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. మహేష్ ఇప్పటికే సినిమాకు పూర్తి స్థాయిలో రెడీ అవ్వగా మిగతా టెక్నీషియన్ టీం అంతా కూడా సన్నద్ధం అవుతున్నారు. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్న విషయంపై క్లారిటీ రాలేదు కానీ మహేష్ రాజమౌళి రెమ్యునరేషన్ డీటైల్స్ ఐతే హింట్స్ వచ్చాయి.

తన ప్రతి సినిమాకు 50 నుంచి 60 కోట్ల దాకా పే చెక్ తీసుకుంటున్న మహేష్ రాజమౌళి సినిమాకు దాదాపు 30 నుంచి 40 శాతం ఎక్కువ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఆ లెక్కన చూస్తే మహేష్ ఈ సినిమాకు 100 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ హీరోల్లో ఇప్పటికే ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ తో అదరగొట్టేస్తున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ కి ఆ రేంజ్ వచ్చింది.

కానీ మహేష్ మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ తోనే 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక మహేష్ లెక్క ఇలా ఉంటే రాజమౌళి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తో పాటుగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడని తెలుస్తుంది. మొదట్లో ఈ మూవీకి మహేష్ రాజమౌళి ఇద్దరు రెమ్యునరేషన్ లేకుండా పనిచేసి బిజినెస్ లో వాటా తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా సినిమా మొదలయ్యే టైం లో మహేష్ కు 100 కోట్లు పారితోషికం గా ఫిక్స్ చేశారని అంటున్నారు.

అంతేకాదు రాజమౌళి రెమ్యునరేషన్ అంతకన్నా ఎక్కువే ఉంటుందని చెప్పుకుంటున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజై ఆ సినిమా ఆస్కార్ దాకా ప్రయాణించే వరకు రాజమౌళి సినిమా విషయంలో వేసే ప్రతి స్టెప్ చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటుంది. అందుకే ఆ రేంజ్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడని తెలుస్తుందుఇ. రాజమౌళి సినిమా అంటే రిజల్ట్ పక్కా హిట్టే అన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్ అనేలా ఉన్నారు నిర్మాతలు. మరి మహేష్ రాజమౌళి రెమ్యునరేషన్ తోనే పిచ్చెక్కిస్తుంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి. సినిమాలో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఫిమేల్ లీడ్ నుంచి మిగతా కాస్టింగ్ గురించి కూడా త్వరలో క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News