కల్కి 2898AD: మహేష్ బాబు రివ్యూ ఇచ్చేశాడు

ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన కల్కి సినిమాకు అన్ని సెంటర్లలో బ్రహ్మరథం పడుతున్నారు సినీ ప్రియులు.

Update: 2024-07-08 16:51 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మహాభారతం నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కు సైన్స్ ను యాడ్ చేసి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానానికి ఫిదా అయ్యారు. నాగి టాలెంట్ అదుర్స్ అని అంతా కొనియాడుతున్నారు. రెండు జోనర్లను బ్లెండ్‌ చేసిన తీరు అద్భుతం అని చెబుతున్నారు. అలా నేషనల్ లెవల్ లో ఆయన మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన కల్కి సినిమాకు అన్ని సెంటర్లలో బ్రహ్మరథం పడుతున్నారు సినీ ప్రియులు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే రిలీజ్ అయ్యి 11 రోజులు అవుతున్నా.. ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది కల్కి. 11 రోజుల్లో రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోనుంది.

అయితే ఇప్పటికే ఈ మూవీ చూసిన అనేక మంది సినీ ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా కల్కి మూవీకి రివ్యూ ఇచ్చి మేకర్స్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెస్పాండ్ అయ్యారు. "కల్కి2898AD… నా మనసును కదిలించింది జస్ట్ వావ్!! నాగ్ అశ్విన్ మీ భవిష్యత్తు దృష్టికి హ్యాట్సాఫ్.. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం" అంటూ మహేష్ కొనియాడారు..

"అమితాబ్ బచ్చన్ సర్.. మీ మహోన్నత స్క్రీన్ ప్రెజెన్స్ సాటిలేనిది.. కమల్ హాసన్ సర్ మీరు పోషించే ప్రతి పాత్ర ప్రత్యేకమే.. ప్రభాస్ మీరు మరో గొప్ప సినిమాను ఈజీగా చేసేశారు. దీపిక పదుకొనె ఎప్పటిలాగే అద్భుతం. కల్కితో అద్భుత విజయం సాధించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ తోపాటు మొత్తం టీమ్‌ కు అభినందనలు" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ గా మారింది.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. ఇప్పుడు అన్నీ ఏరియాల్లోనూ కల్కి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ పూర్తి చేసుకుందని సమాచారం. అయితే కల్కిలో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రాజమౌళి, అనుదీప్‌ వంటి అనేక మంది ప్రముఖులు నటించి మెప్పించారు.

Tags:    

Similar News