మహేష్ స్టైలిష్ లుక్.. ఎమున్నాడ్రా బాబు..

ఈ లుక్ లో మహేష్ బాబును చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఏమన్నాడ్రా బాబు అంటూ పాజిటివ్ గా మేమ్స్ అయితే వదులుతూ ఉన్నారు.

Update: 2023-10-11 16:53 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ హీరోలలో బెస్ట్ హ్యాండ్సమ్ లుక్స్ కలిగిన వారిలో మహేష్ కూడా టాప్ పొజిషన్ లో పోటీని ఇవ్వగలడు అని చెప్పవచ్చు.


ఇక ఒకవైపు క్లాస్ లుక్స్ తోనే కాకుండా మరొకవైపు మాస్ లుక్కుతో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక స్టార్ మహేష్ బాబు. అప్పుడప్పుడు స్పెషల్ ఫోటోషూట్స్ తో మహేష్ బాబు సోషల్ మీడియాని కూడా షేక్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా మరొకసారి స్టైలిష్ గా దర్శనమిచ్చాడు. ఈ లుక్ లో మహేష్ బాబును చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఏమన్నాడ్రా బాబు అంటూ పాజిటివ్ గా మేమ్స్ అయితే వదులుతూ ఉన్నారు.

స్టైలిష్ సూట్ లో మహేష్ బాబు నెవర్ బిఫోర్ అనేలా అట్రాక్ట్ అయితే చేస్తున్నాడు. గతంలో చాలాసార్లు ఫోటో షూట్ చేసిన మహేష్ బాబు ఈసారి మాత్రం అంతకుమించి అనేలా ఉన్నట్లు పాజిటివ్గా రియాక్షన్స్ వస్తున్నాయి. టీ షర్ట్ సూటు బూటు. అలాగే ఆ హెయిర్ స్టైల్ కూడా అమ్మాయిల మనసును దోచేస్తున్నాయి అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ డిసెంబర్ మొదటి వారానికి ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ దసరాకు మొదటి లిరికల్ సాంగ్ విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. దసరా నుంచి నాన్ స్టాప్ గా సినిమాపై బజ్ పెరిగే విధంగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి అని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News