మహేష్ బాబు క్రేజ్ అలాంటిది
'గుంటూరు కారం' పది రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతూ వస్తోంది.
ఈ సంక్రాంతికి రిలీజైన మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' అంచనాలను అందుకోలేకపోయింది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు కానీ.. అది సగటు మాస్ మసాలా సినిమాలా ఉండడం.. త్రివిక్రమ్ పాత కథలనే అటు ఇటు తిప్పి ఒక ప్యాకేజీ సినిమాలా అందించడం మెజారిటీ ప్రేక్షకులకు రుచించలేదు.
అయినా సరే.. వచ్చిన టాక్‌తో పోలిస్తే ఈ సినిమా మంచి వసూళ్లే సాధించింది. బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న 'హనుమాన్' పోటీని తట్టుకుని ఉన్నంతలో మంచి వసూళ్లు సాధించడంలో మహేష్ బాబు స్టార్ పవర్ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. మహేష్ మేనియా ఎలాంటిదో థియేట్రికల్ రిలీజ్ అప్పుడే కాదు.. డిజిటల్ రిలీజ్ సందర్భంగానూ మరోసారి రుజువైంది.
'గుంటూరు కారం' పది రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతూ వస్తోంది. హిందీలో, ఇంగ్లిష్‌లో పెద్ద పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. 'గుంటూరు కారం' గ్లోబల్ చార్ట్స్‌లో ఆధిపత్యం చలాయిస్తోంది. రెండో వారంలో కూడా ఈ సినిమాకు 18 లక్షల వ్యూస్ వచ్చాయని.. వరల్డ్ వైడ్ లిస్ట్‌లో టాప్-8లో ఉందని నెట్ ఫ్లిక్స్ స్పందించింది.
బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఫ్లాప్ అయిన సినిమాకు ఓటీటీలో ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం గొప్ప విషయమే. డంకీ సినిమా వరల్డ్ వైడ్ టాప్-5లో కొనసాగుతోంది. విశేషం ఏంటంటే గుంటూరు కారం తెలుగు వెర్షన్ కంటే మిన్నగా హిందీ వెర్షన్‌కు వ్యూస్ వస్తున్నాయి. 'గుంటూరు కారం'లో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. మహేష్ కోసమే సినిమా చూడొచ్చు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. టాక్ బాలేకున్నా సరే.. ఓటీటీలో ఈ సినిమాను జనం బాగా చూస్తున్నారు. ఇక్కడ చూసిన వాళ్లు థియేట్రికల్ రిలీజ్ టైంలో మరీ అంత నెగెటివ్ టాక్ రావాల్సింది కాదు అని అభిప్రాయపడుతున్నారు.