16 ఏళ్ల త‌ర్వాత ఫ్యాష‌న్ కి సీక్వెల్!

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. హిట్ సినిమాలకు స్టార్ మేక‌ర్స్ అంతా సీక్వెల్స్ రూపొందించే ప‌నిలో ప‌డ్డారు.

Update: 2024-07-31 06:06 GMT

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. హిట్ సినిమాలకు స్టార్ మేక‌ర్స్ అంతా సీక్వెల్స్ రూపొందించే ప‌నిలో ప‌డ్డారు. దీనిలో భాగంగా ఏకంగా 20..25 ఏళ్ల క్రితం నాటి హిట్ సినిమాల్ని సైతం త‌వ్వి తీస్తున్నారు. వాటికి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించి బాగుంటుందంటే ? ముందుకెళ్లిపోతున్నారు. ఇటీవ‌లే 27 ఏళ్ల క్రితం హిట్ అయిన `బార్డ‌ర్` సినిమాకి సీక్వెల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా 16 ఏళ్ల క్రితం నాటి ప్యాష‌న్ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసారు.

ప్రియాంక చోప్రా, కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌ధురా బండ‌ర్కార్ తెరకెక్కించిన `ప్యాష‌న్` 2008 రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఒక వ్య‌క్తి ప్యాష‌న్ రంగంలో సూప‌ర్ మోడ‌ల్ గా ఎద‌గాలంటే? దాని వెనుక క‌ష్టాన్ని తెలియ‌జేస్తూ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఈ సినిమాకి జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు పీసీ, కంగ‌న‌.

రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్ర‌క‌టించి అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసారు. ఈ క‌థ‌కి కొన‌సాగింపు క‌థ‌ని మ‌ధుర బండార్క‌ర్ సిద్దం చేస్తున్నారు. నేటి జ‌న‌రేష‌న్ లో మోడ‌లింగ్ రంగం ఎలా ఉంది? ఇప్పుడెలాంటి మార్పులు చేసుకున్నాయి? వంటి అంశాల ఆధారంగా సీక్వెల్ క‌థ‌ని సిద్దం చేస్తున్నారు. అయితే ఇందులో పీసీ, కంగ‌న న‌టిస్తారా? కొత్త వాళ్ల‌ను తెర‌పైకి తెస్తారా? అన్న‌ది చూడాలి.

ఇందులో కొత్త వారికే అవ‌కాశం ఉంటుంది. పీసీ, కంగ‌న‌ల వ‌య‌సు కూడా పెరిగింది. వారిప్పుడు సూప‌ర్ హీరోయిన్ల‌గా ఎదిగారు. వాళ్ల‌తో మ‌ళ్లీ మోడ‌లింగ్ రోజుల్ని గుర్తి చేయ‌డం అంటే రుచించే అవ‌కాశం ఉండ‌దు. నేటి జ‌న‌రేష‌న్ భామ‌ల్ని తీసుకుని చేస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి.

Tags:    

Similar News