ఎల్లో బ్లౌజ్‌తో బోల్డ్ మ‌లైకా అరోరా

మ‌లైకా అరోరా క‌చ్ఛితంగా నేటిత‌రానికి పోటీనిస్తున్న మేటి ఫ్యాష‌నిస్టా అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Update: 2024-08-30 07:23 GMT

మ‌లైకా అరోరా క‌చ్ఛితంగా నేటిత‌రానికి పోటీనిస్తున్న మేటి ఫ్యాష‌నిస్టా అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌లైకా ఎంపిక‌లు ప్ర‌తిసారీ సోష‌ల్ మీడియాల‌లో చ‌ర్చ‌గా మారుతున్నాయి. తాజాగా మ‌లైకా ప‌సుపు రంగు డిజైన‌ర్ బ్లౌజ్ ప‌రికిణీలో మ‌తులు చెడ‌గొట్టింది. అందుకు సంబంధించిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

మలైకా అరోరా ఇటీవల ముంబైలో జరిగిన ఒక బ్యూటీ ఈవెంట్‌లో బోల్డ్ -వైబ్రెంట్ ఎల్లో కో-ఆర్డ్ సెట్ దుస్తుల‌ను ధరించి ఇత‌రుల‌తో పోటీప‌డింది. ప్ర‌త్యేకంగా త‌న‌కోసమే డిజైన్ చేసిన‌ డ్రమాటిక్ ఫుల్ లెంగ్త్ స్కర్ట్ లో మ‌లైకా ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. తెల‌తెల్ల‌ని ముత్యాలు, ఆకుపచ్చ రత్నాలతో అలంకరించిన అంద‌మైన‌ స్టేట్‌మెంట్ చోకర్ నెక్లెస్‌, మ్యాచింగ్ చెవిపోగులతో స్టైల్ ఐకాన్ ని త‌ల‌పించింది. ఈవెంట్ నుండి ఒక వైరల్ వీడియోలో మలైకా తన స్కర్ట్‌ను సరిచేసుకోవడం, కెమెరాలకు అందంగా పోజులిస్తూ క‌నిపించింది. మలైకా డ్యాషింగ్ అప్పియ‌రెన్స్ అహూతుల‌ను క‌ట్టి ప‌డేసింది. ఈవెంట్లో క‌ళ్ల‌న్నీ ఈ అందంపైనే..! ప్ర‌స్తుతం ఈ ఎల్లో లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

యాభై వ‌య‌సులో మ‌లైకా ఆత్మ‌విశ్వాసం నేటిత‌రానికి స్ఫూర్తి. మ‌లైకా డ్రెస్సింగ్ సెన్స్ .. ఫ్యాష‌న్ సెన్స్.. లుక్ డిజైన్ ఇలా ప్ర‌తిదీ యువ‌త‌రం అనుక‌రించేదే. ఇప్పుడు మ‌లైకా స్టైల్ స్టేట్ మెంట్ యూత్ లోకి వేగంగా దూసుకెళుతోంది. ఇటీవ‌ల మ‌లైకా అంద‌చందాల‌కు ఫిదా అయిన ఒక అభిమాని `హాటెస్ట్ 51 మహిళ` అని ప్ర‌శంస‌లు కురిపించాడు. మ‌లైకా ఇటీవ‌ల బుల్లితెర రియాలిటీ షోల జ‌డ్జిగా కొన‌సాగుతోంది. మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీగా ఆర్జిస్తోంది. త్వ‌ర‌లోనే త‌న కుమారుడిని వెండితెర హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉంది.

Tags:    

Similar News