ప్రేమ కోసం పోరాడతాను... కానీ గీత దాట‌ను: మ‌లైకా

మ‌లైకా అరోరా- అర్జున్ క‌పూర్ మ‌ధ్య సంబంధం ముగిసిందంటూ ఇటీవ‌ల మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి

Update: 2024-06-29 03:15 GMT

మ‌లైకా అరోరా- అర్జున్ క‌పూర్ మ‌ధ్య సంబంధం ముగిసిందంటూ ఇటీవ‌ల మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు విషెస్ చెప్పుకోవ‌డం లేదా ముఖ్య‌మైన రోజు క‌లుసుకోవ‌డం వంటివి విర‌మించారు. అందుకే ఇప్పుడు ఈ పుకార్లు షికార్ చేస్తున్నాయ‌ని నెటిజ‌నుల్లో బోలెడంత చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే ఈ బ్రేక‌ప్ పుకార్ల‌పై మలైకా అరోరా ఇంత‌కాలం స్పందించ‌లేదు. ఎట్ట‌కేల‌కు మొదటిసారి వీటిపై స్పందించింది. నేను ప్రేమ కోసం చివ‌రివ‌ర‌కూ పోరాడతాను...కానీ గీత దాట‌ను! అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్‌తో తన రిలేషన్‌షిప్ ముగిశాక‌.. మ‌లైకా తన జుహు నివాసంలో ప్రియుడితో అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకల‌ను చేయ‌క‌పోవ‌డం.. అర్జున్‌కి శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డంతో చాలా సందేహాలు రాజుకున్నాయి. ఇది వారి బ్రేకప్ గురించి ఊహాగానాలకు దారితీసింది. అయితే నెటిజ‌నుల్లో సాగుతున్న ఈ డిబేట్ మ‌లైకాను తీవ్రంగా హ‌ర్ట్ చేసింద‌న‌డానికి ఆమె మాట‌లే ఆధారం.

మ‌లైకా మాట్లాడుతూ చాలా ఎమోష‌న‌ల్ అయింది. ''నేను ఏదో ఒక మెకానిజం - లేదా షీల్డ్‌ని నిర్మించాను - నా చుట్టూ నేను ప్రతికూలతను ఇకపై వదిలిపెట్టను'' అని మలైకా హలో మ్యాగజైన్‌తో అన్నారు. నేను దాని నుండి నన్ను ఇన్సులేట్ చేసుకున్నాను. అది వ్యక్తులు అయినా, పని వాతావరణం అయినా, సోషల్ మీడియా అయినా లేదా ట్రోలింగ్ అయినా. నేను ఆ శక్తిని అనుభవించిన నిమిషం.. నేను తక్షణమే వెనక్కి తగ్గుతాను. ఇది నేను కాలక్రమేణా నేర్చుకున్న విషయం. ఇది నాకు ముందుగానే వస్తుంది.. నేను దాని గురించి నిద్రను కోల్పోతాను. ఇవేవీ నన్ను అస్సలు ప్రభావితం చేయవని చెబితే నేను అబద్ధం చెప్పిన‌ట్టే. నేను కూడా మనిషినే కాబట్టి.. ఇలాంటి వాటికి నేను ఏడుస్తాను.. విరుచుకుపడతాను.. ట్రోలింగ్ కి సంబంధించిన అన్ని భావోద్వేగాలను కలిగి ఉంటాను. కానీ మీరు దానిని బహిరంగంగా చూడలేరు'' అని మ‌లైకా తెలిపారు.

ఇంటర్నెట్‌లో ఊరు పేరు లేని వ్యక్తులతో గొడ‌వ‌లు త‌న‌కు అవసరం లేదని మలైకా చెప్పింది. ట్రోలింగ్ తో నాకు ఏమీ కాదు! అని అంది. నాకు ప్రతిదీ తెలుసు.. నేను రాక్ కింద నివసించను .. కానీ నేను దాని నుండి దూరంగా ఉన్నాను అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసింది.

త‌న‌ను లవ్ లైఫ్‌ గురించి ప్ర‌శ్నించ‌గా.. మలైకా తాను హార్డ్‌కోర్ రొమాంటిక్ అని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ నిజమైన ప్రేమ ఆలోచనను నేను ఎప్పటికీ వదులుకోను. నేను ఒక సాధారణ యువ‌తినే కాబట్టి చివరి వరకు ప్రేమ కోసం పోరాడతాను. కానీ నేను కూడా చాలా వాస్తవికంగా ఉంటాను. గీతను ఎక్కడ గీయాలో నాకు తెలుసు! అని వ్యాఖ్యానించింది.

గత నెలలో అర్జున్ - మలైకా మ‌ధ్య ప్రేమాయ‌ణం ముగిసింద‌నే పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే ఈ జంట‌ చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. వారిద్దరూ ఒకరి హృదయాలలో ఒకరికొకరు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. కానీ విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విషయంలో గౌరవప్రదమైన మౌనాన్ని పాటిస్తారు. వారి సంబంధం గురించి గుంజ‌డానికి లేదా విడదీయడానికి వారు ఎవరినీ అనుమతించరు! అని పింక్‌విల్లా ఒక క‌థ‌నంలో పేర్కొంది.

Tags:    

Similar News