మ‌లైకా మ‌తి చెడే ట్రీట్‌.. క‌ళ్లు తిప్పుకోలేరు!

ఈసారి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌లైకా స్పెష‌ల్ ట్రీట్ ని షురూ చేయ‌డంతో ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో ఈ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది.

Update: 2024-02-14 13:21 GMT

మలైకా అరోరా ప‌బ్లిక్ అప్పియ‌రెన్సులు తాజా ఫోటోషూట్లు ఎల్ల‌పుడూ సంచ‌ల‌న‌మే. ఈసారి కూడా అలాంటి సెన్సేష‌న్ త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని నిరూపిస్తోంది. మ‌లైకా తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. మ‌ల్లా అభిమానుల గుండెల్లో ఈ ఫోటోషూట్ జ్వాల‌లు రేపింది. తాజా ఫోటోషూట్ లో మ‌లైకా థై స్లిట్ ఎలివేష‌న్ మ‌తులు చెడ‌గొడుతోంది.


ఈసారి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌లైకా స్పెష‌ల్ ట్రీట్ ని షురూ చేయ‌డంతో ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో ఈ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ కి ఎలాంటి క్యాప్షన్‌లు లేకుండా మ‌ల్లా షేర్ చేసింది. మ‌లైకా గోల్డెన్ క‌ల‌ర్ గౌన్ చాలా స్పెష‌ల్ ఎలివేష‌న్ తో ఆక‌ట్టుకుంటోంది. బోల్డ్ మేకప్.. స్టైలిష్ పఫ్డ్ హెయిర్‌స్టైల్ త‌న‌ ఆకర్షణను పెంచింది. ఓ ఫోటోలో మ‌లైకా గోల్డెన్ క‌ల‌ర్ ఫ్రాక్ దానిని క‌వ‌ర్ చేస్తున్న భారీ ఊల్ కోట్ త‌న లుక్ నే మార్చేసాయ‌ని చెప్పాలి. అభిమానులు వ్యాఖ్యల‌ విభాగంలో మ‌లైకా అందాన్ని చెల‌రేగి పొగిడేస్తున్నారు.


మ‌లైకా బాలీవుడ్ లో టాప్ మోడ‌ల్ కం న‌టి.. అంత‌కుమించి గొప్ప న‌ర్త‌కి. డ్యాన్స్ రియాలిటీ షో హోస్ట్. ప్ర‌స్తుతం సినిమాల్లో ఐట‌మ్ నంబ‌ర్ల‌కు అవ‌కాశం లేదు. టీవీ రియాలిటీ షోలు, సోష‌ల్ మీడియా యాడ్ పోస్టింగులు.. ఫ్యాష‌న్ షోల‌తో మ‌లైకా ఆర్జ‌న‌కు కొదవేమీ లేదు. గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచంలో మ‌లైకా సంపాద‌న‌, ల‌గ్జ‌రీ లైఫ్ ప్ర‌తిసారీ యువ‌త‌రాన్ని ఆక‌ర్షిస్తున్నాయి. 50 వ‌య‌సులోను మ‌లైకా ఎలాంటి భేష‌జానికి పోకుండా ప‌బ్లిక్ లో షో స్టాప‌ర్ గా నిల‌వ‌డాన్ని ఫ్యాషన్ స్టూడెంట్స్ ఒక పాఠంలా నోట్ బుక్ లో రాసుకుంటారు!

Tags:    

Similar News