గుండె పోటుతో దర్శకుడు మృతి
ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ (69) గుండెపోటుతో మృతి చెందారు.
ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ (69) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం గుండెపోటు రావడంతో హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. న్యూమోనియా..కాలెయ వ్యాధికి సంబంధించి చాలా కొంతగా కాలంగా చికిత్స తీసుకుంటారు. ఈ క్రమంలోనే గుండెపోటు బారిన పడ్డారు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
ఇక దర్శకుడిగా సిద్దిఖీ మాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా సినిమాలు అందించారు. `గాడ్ ఫాదర్`.. `హిట్లర్`.. `బిగ్ బ్రదర్`.. `ప్రెండ్స్`..`కాబులీవాలా` లాంటి సినిమాలు తెరకెక్కించారు. సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. స్క్రీన్ రైటర్ గా.. నిర్మాతగా కూడా ఆయన సేవలందించారు. తెలుగు సినిమాల తోనూ ఆయనకు అనుబంధం ఉంది.
నితిన్- మీరా చోప్రా జంటగా నటించిన `మారో` సినిమాని సిద్దిఖి దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన `హిట్లర్` సినిమా కథ కూడా ఆయనే అందించారు. తెలుగు- తమిళ భాషల్లో భారీ విజయం సాధించిన రజనీకాంత్ `చంద్రముఖి` మాతృక మలయాళ సినిమా `మణిచిత్రతళు`కు సెకండ్ యూనిట్ దర్శకుడిగా సిద్ధిఖీ పని చేశారు.
హిందీలో రెండు సినిమాలు- తమిళంలో ఐదు సినిమాలు తెరకెక్కించారు. మాతృభాష మలయాళంలో మాత్రం 20కి పైగా సినిమాలు తీశారు. మోహన్ లాల్ -సిద్దికి మంచి స్నేహితులు. సిద్ధిఖీ మృతి పట్ల మలయాళ చిత్రసీమ సంతాపం తెలిపింది.