ఎవరికి జోలికి వెళ్లను..మెడిటేటివ్ మోడ్ లో ఉంటాను!
ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. లావణ్య కావాలని నా క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తోందని మాల్వీ మల్హోత్రా చెప్పుకొచ్చింది.
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం అంతా మాల్వీ మల్హోత్రా కేంద్రంగానే సాగుతోన్న సంగతి తెలిసిందే. మాల్వీ మల్హోత్రానే రాజ్ తరుణ్ ని వలలో వేసుకుందనికే, ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని లావణ్య ఆరోపణలు చేస్తోంది. ఇద్దరు కలిసున్నట్లు నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని లావణ్య అంటుంది. మాల్వీ మల్హోత్రా ఆమె తమ్ముడు నాకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించారని లావణ్య ఆరోపిస్తోంది. నా మొగుడుతో మాల్వీ మల్హోత్రా ఎలా తురుగుతుందని లావణ్య ప్రతి సారి మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తుంది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే మాల్వీ మల్హోత్రా పోలీస్ స్టేషన్ లో లావణ్యపై కేసు పెట్టింది. లావణ్య పదే పదే వ్యక్తిత్వ హనానికి పాల్పడుతుందని, నా కెరియర్ నాశనం చేసే ప్రయత్నం చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తిరగబడర సామి ప్రమోషన్స్ లో మాల్వీ మల్హోత్రా పాల్గొంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. లావణ్య కావాలని నా క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తోందని మాల్వీ మల్హోత్రా చెప్పుకొచ్చింది.
నేను సైలెంట్ గా ఉంటూ నా పనేదో నేను చేసుకునే రకం. ఎవరికి జోలికి వెళ్లను. అనవసరమైన కాంట్రవర్సీలకి దూరంగా ఉంటాను. ఎక్కువగా పాజిటివ్ గా ఉండేందుకు ట్రై చేస్తాను. మెడిటేటివ్ మోడ్ లో ఉంటాను. అందుకే ఈ ఇష్యూ నన్ను మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. నా తప్పు లేనపుడు నేను భయపడను. అలాగే ఆ టెన్షన్స్ ని మనసుకి తీసుకోను. వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే లావణ్య మీద పోలీసులకి ఫిర్యాదు చేశాను. వారు అన్ని చూసుకుంటారు.
రాజ్ తరుణ్ తో నేను కలిసున్నాను అనేది చాలా పెద్ద ఆరోపణ. మా మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదు. అతను హైదరాబాద్ లో ఉంటాడు. నేను ఎక్కడో ముంబైలో ఉంటా. కేవలం సినిమా కోసం కొన్ని నెలలు కలిసి వర్క్ చేసామని మాల్వీ మల్హోత్రా చెప్పింది. నా పేరెంట్స్ నన్ను నమ్ముతారు. నేను ఎలాంటి తప్పు చేయనని వారి స్ట్రాంగ్ ఫీలింగ్. హీరోయిన్ గా కెరియర్ ఎంచుకున్నప్పుడు ఆరంభంలో కొంత అభ్యంతరం చెప్పారు. తరువాత నా ఇంటరెస్ట్ అర్ధం చేసుకొని సపోర్ట్ చేశారు.
మా డాడీ నాకు పెద్ద సపోర్ట్. ప్రతి విషయంలో నా వెంట ఉంటారు. లావణ్యని ఇప్పటి వరకు నేను కలవలేదు. ఆమె నాకు ఫోన్ చేసిన ప్రతిసారి దారుణంగా తిడుతూ మాట్లాడుతుంది. గొడవ చేసేది. అలాంటి వారికి నేను వీలైనంత దూరంగా ఉంటాను. ఆమెని కలవాలని కూడా అనుకోవడం లేదు. ఆమె మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్ధం కాదు. ఆమె చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్ని సార్లు అయిన చెబుతానని మాల్వీ మల్హోత్రా చెప్పుకొచ్చింది.
తిరగబడర సామి సినిమాలో నేను చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసాను. ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. రవికుమార్ చౌదరి గారు మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అతనికి ప్రతి విషయంలో పూర్తిగా అవగాహన ఉంటుంది. టీమ్ అందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు. ఓ మంచి సినిమాతో టాలీవుడ్ లోకి పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మొదటి సినిమాతోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం కాస్తా బాధపెడుతోందని మాల్వీ మల్హోత్రా ఇంటర్వ్యూలో తెలియజేసింది.